పెరగనున్న వేగం.. మారనున్న రూపం.. భవిష్యత్ విమానాలు ఇవే..
మనం ఎప్పుడూ చూసే విమానాల రూపం మారనుందా? వేగం మరింత పెరగనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న లోహవిహంగాల ఆకృతి, వేగం త్వరలో మారనుంది. బార్సిలోనాకు చెందిన డిజైనర్ ఆస్కార్ వినల్స్.. స్కై ఓవీ పేరుతో ఓ వినూత్న విమాన డిజైన్‌ను రూపొందించారు. దాని ఊహా చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. భవిష్యత్‌తరం వాణిజ్య విమానాలు ప్రస్తుతం ఉన్న వాటి కంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.
మనం ఎప్పుడూ చూసే విమానాల రూపం మారనుందా? వేగం మరింత పెరగనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న లోహవిహంగాల ఆకృతి, వేగం త్వరలో మారనుంది. బార్సిలోనాకు చెందిన డిజైనర్ ఆస్కార్ వినల్స్.. స్కై ఓవీ పేరుతో ఓ వినూత్న విమాన డిజైన్‌ను రూపొందించారు. దాని ఊహా చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. భవిష్యత్‌తరం వాణిజ్య విమానాలు ప్రస్తుతం ఉన్న వాటి కంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి అని ఆయన పేర్కొన్నారు. ఆస్కార్ వినల్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విమానాన్ని బ్లేడ్‌లెస్ టర్బోజెట్ ఇంజిన్లతో రూపొందిస్తున్నారు. అందులో 300 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. సరకులను తీసుకెళ్లవచ్చు. అందులో విలాసవంతమైన సాధనాలు ఉంటాయి. గంటకు 1,850 కిలోమీటర్ల వేగంతో అవలీలగా ప్రయాణిస్తుంది. అతి తక్కువ హైడ్రోజన్ ఇంధనాన్ని వినియోగించుకొని సుదీర్ఘ దూరాలను చేరుకుంటుంది. కర్బన ఉద్గారాలను వెలువరించదు. ఈ విమానాలను ఎయిర్‌పోర్టులో నిలిపి ఉంచాక దాని రెక్కలను మూసుకుపోయేలా చేయొచ్చు. ఫలితంగా విమానాశ్రయంలో స్థలాన్ని ఆదా చేసుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

