Watch Video: అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి గోల్.. ఉత్కంఠ విజయంతో గంగూలీని మరోసారి గుర్తుచేసిన మహిళా ఫుట్ బాలర్..
ఆదివారం జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. దీంతో ఆటగాళ్ల ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి.
UEFA మహిళల యూరో 2022 ఫైనల్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు జర్మనీని ఓడించింది. ఎక్స్ ట్రా అవర్ లో జర్మనీపై ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1తో గెలిచింది. ఈ విజయం స్క్రిప్ట్‌ను క్లూ కెల్లీ రాసింది. ఆమె 110వ నిమిషంలో గోల్ చేసి తన జట్టుకు టైటిల్‌ను అందించడంతో పాటు గెలిపించింది. కార్నర్ నుంచి వచ్చిన పాస్‌ను గోల్‌గా మలిచిన క్లోయ్.. దీంతో ఇంగ్లండ్‌ను ఛాంపియన్‌గా మార్చింది. గోల్ కొట్టిన వెంటనే, క్లొయ్ తన టీ-షర్టును విప్పి, తన ఆనందాన్ని సహచరులతో పంచుకుంది. అయితే, ఈమె చేసిన పని చూసిన నెటిజన్లు.. నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీని గుర్తు చేసుకుంటున్నారు.
జెర్సీ విప్పేసిన క్లూ కెల్లీ..
క్లూ కెల్లీ వేడుకకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లోయ్ గోల్ కొట్టిన వెంటనే, ఆమె రిఫరీ వైపు చూసింది. గోల్ చెల్లుబాటు అయ్యేదని రిఫరీ ప్రకటించిన వెంటనే, ఆమె తన టీ-షర్టును విప్పి గాలిలో తిప్పుతూ, ఆనందంతో పరుగు లంఖించుకుంది. ఈ విజయం తర్వాత క్లాయ్ తన టీ-షర్ట్ ధరించలేదు. అదే శైలిలో డ్రెస్సింగ్ రూమ్‌లోనూ కనిపించింది.
మొదటి అంతర్జాతీయ గోల్ కావడంతో..
మాంచెస్టర్ సిటీ తరపున ఆడుతున్న క్లూ కెల్లీ ఈ గోల్‌ను ఎప్పటికీ మరచిపోదు. ఎందుకంటే ఇది తన మొదటి అంతర్జాతీయ గోల్. కెల్లీ సాధించిన ఈ గోల్ ఇంగ్లండ్‌ను ఛాంపియన్‌గా మార్చింది. ఆమె తీవ్రమైన గాయం నుంచి తిరిగి వచ్చింది. గత ఏడాది మేలో, ఆమె స్నాయువు గాయంతో బాధపడింది. దాని కారణంగా ఆమె టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించడమే కాకుండా మానసికంగా కూడా కలత చెందింది. క్లబ్‌కి తిరిగి వచ్చిన తర్వాతే ఆమె గాయం కూడా మానసికంగా దెబ్బతిన్నదని తేలింది. ఈ టోర్నమెంట్‌లో ఆమె ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగింది. ఫైనల్‌లో ఆమె రికార్డు స్థాయిలో 87,192 మంది వ్యక్తుల మధ్య జర్మనీపై టోర్నమెంట్ విన్నింగ్ గోల్ సాధించింది.
Chloe Kelly goal?❤️ She give lead 2_1#WEURO2022 pic.twitter.com/KiNpJclU7M
— Maheen (@Madridheen) July 31, 2022
Chloe Kelly. England’s hero ? pic.twitter.com/U3NAe90igg
— B/R Football (@brfootball) July 31, 2022
ఇంగ్లండ్ విజయం తర్వాత, ఇది తన కెరీర్‌లో అత్యుత్తమ క్షణం అని క్లొయ్ పేర్కొంది. ‘ఇది ఒక కల లాంటిది. ఇది ఒక అద్భుతం. మాకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. నా గాయం సమయంలో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. గాయం తర్వాత తిరిగి రాగలనని ఎప్పుడూ అనుకునేదాన్ని. నా కుటుంబం, స్నేహితులు, ప్రతి అభిమానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చింది.