Viral Video: చేతులు చిన్నవైనా చేసిన సాయం గొప్పది.. మనసులు గెలుచుకుంటున్న వీడియో
మానవత్వం.. కేవలం మనుషుల్లో మాత్రమే గుండే గుణం. కానీ దాన్ని మనం మరిచి జీవిస్తున్నాం.. యంత్రాల్లా పరిగెత్తే ఈ కాలంలో పక్కన ఉన్న మనిషిని పలకరించే సమయం కూడా దొరకడం లేదు జనానికి.

Viral Video: మానవత్వం.. కేవలం మనుషుల్లో మాత్రమే ఉండే ఓ గొప్ప గుణం. కానీ దాన్ని మనం మర్చిపోయి జీవిస్తున్నాం.. యంత్రాల్లా పరిగెత్తే ఈ కాలంలో పక్కన ఉన్న మనిషిని పలకరించే సమయం కూడా దొరకడం లేదు..అలాంటిది పక్కవాడి కష్టాన్ని పంచుకునే తీరిక ఉంటుందా..? పక్కవాడు చావుబ్రతుకుల్లో ఉన్నా పట్టించుకోని సందర్భాలు చాలా చూశాం.. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి చావుబ్రతుకుల్లో ఉన్నా సెల్ ఫోన్ లో వీడియోలు , సెల్ఫీలు తీసుకునే జనాలు కూడా ఉన్నారు మన మధ్య. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రజల హృదయాలను తాకుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే..
ఈ వీడియోలో ఇద్దరు చిన్న పిల్లలు చేసిన పని మానవత్వానికి ఉదాహరణగా నిలిచింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఇద్దరు చిన్నారులు నిస్సహాయ మహిళకు ఎలా సహాయం చేస్తున్నారో చూడవచ్చు. ఓ మహిళా తోపుడు బండి పై పండ్లవ్యాపారం చేస్తుంది.. నెలల చిన్నారిని ఆ బండి పై పడుకోబెట్టి పండ్లు అమ్ముతూ.. ఓ ఎత్తైన ప్రదేశం పైకి బండిని నెట్టలేక అవస్థ పడింది. ఆమె అవస్థను చూస్తున్న జనం పట్టించుకోనట్టుగా వెళ్లిపోయారు. కానీ ఇద్దరు చిన్నారులు మాత్రం అక్కడికి చేరుకుని ఆ మహిళకు సహాయం చేశారు. చేతులు చిన్నవైనా చేసినసాయం గొప్పది. ఆ తర్వాత ఆ మహిళ పిల్లలిద్దరికీ తినడానికి అరటిపండ్లుఇచ్చింది. ఆ మహిళకు పిల్లలు సహాయం చేసిన తీరు ప్రజల మనసులను గెలుచుకుంది. ఈ వీడియో పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
आपकी डिग्री सिर्फ़ एक काग़ज़ का टुकड़ा है, अगर वो आपके व्यवहार में ना दिखे. pic.twitter.com/o4lXIVobrx
— Awanish Sharan (@AwanishSharan) March 22, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :
