AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: నెటిజన్లకు సవాల్‌ విసిరిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. ఈ ఫోటోలో ఉన్న బస్సును గుర్తించండి..

Viral Photo: ప్రస్తుతం మనమంతా సోషల్‌ మీడియా (Social Media) యుగంలో ఉన్నాము. సమాచారం నుంచి కాలక్షేపం వరకు ప్రతీ ఒక్కరూ సోషల్‌ మీడియానే ఎంచుకుంటున్నారు. క్షణం ఖాళీ సమయం దొరికిందంటే చాలు వెంటనే సోషల్‌ మీడియాలో..

Viral Photo: నెటిజన్లకు సవాల్‌ విసిరిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. ఈ ఫోటోలో ఉన్న బస్సును గుర్తించండి..
Rtc Md Sajjanar
Narender Vaitla
|

Updated on: Apr 24, 2022 | 3:55 PM

Share

Viral Photo: ప్రస్తుతం మనమంతా సోషల్‌ మీడియా (Social Media) యుగంలో ఉన్నాము. సమాచారం నుంచి కాలక్షేపం వరకు ప్రతీ ఒక్కరూ సోషల్‌ మీడియానే ఎంచుకుంటున్నారు. క్షణం ఖాళీ సమయం దొరికిందంటే చాలు వెంటనే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఇలా జనాలు రోజులో ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాల్లోనే ఉంటుండడంతో కంపెనీలు సైతం వీటి ఆధారంగా తమ ప్రొడక్ట్‌లను ప్రమోట్‌ చేసుకుంటున్నాయి. దీంతో యాడ్‌ మార్కెట్‌ సైతం సోషల్‌ మీడియానే నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సంస్థలతో పాటు, రాజకీయ నాయకులు సైతం వీటి ద్వారానే తమకు తాము ప్రమోట్ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాను బాగా వాడుకునే వారిలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మొదటి వరుసలో ఉంటారు. తాజాగా ఆర్టీసీ ఎండీగా నియమితులైన సజ్జనార్‌ సంస్థను అభివృద్ధి బాట పట్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే సోషల్‌ మీడియాను వినియోగించుకుంటూ దూసుకుపోతున్నారు.

సినిమా పోస్టర్‌లను మీమ్స్‌గా రూపొందిస్తూ పోస్ట్‌ చేస్తు నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సజ్జనార్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆసక్తిగా ఉంది. హైవే పక్కన ఆగి ఉన్న ఓ లారీ ఫొటోను పోస్ట్‌ చేసిన సజ్జనార్‌. ‘ఈ ఫొటోలో టీఎస్‌ఆర్టీసీ బస్సు ఎక్కడ ఉందో కాస్త చెప్పగలరా.?’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. దీనికి ‘టీఎస్‌ఆర్టీసీ క్విజ్‌’ పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు. మరి పైన కనిపిస్తోన్న ఫొటోలో ఉన్న ఆర్టీసీ బస్సును గుర్తించారా.?

ఏంటి ఎంత చూసినా కనిపించడం లేదా. అయితే ఓసారి అక్కడ ఉన్న లారీ సైడ్‌ మిర్రర్‌ను జాగ్రత్తగా చూడండి. గ్రీన్‌ కలర్‌లో బస్సు కనిపిస్తుంది. లారీ వెనకాల ఉన్న బస్సు మిర్రర్‌లో కనిపిస్తోంది. సజ్జనార్‌ పోస్ట్‌ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. బస్సును కనిపెట్టిన నెటిజన్లు తమ సమాధానాలను కామెంట్ల రూపంలో పోస్ట్‌ చేస్తున్నారు.

Viral

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: మనుషుల్ల పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్న కుక్కలు..

Zomato: ఫుడ్ ప్యాకింగ్ విషయంలో జొమాటో సంచలన నిర్ణయం.. ఈ నెల నుంచి వాటిపై పూర్తి నిషేధం..

Chanakya Niti: సమాజంలో గౌరవ మర్యాదల పొందాలంటే.. ఎటువంటి వ్యక్తులతో ఎలా నడుచుకోలో చెప్పిన చాణక్య