Viral Video: మంచి నిద్రలో ఉన్న పెద్ద పులి.. లేపి మరీ బుక్కైన శునకం.. వైరల్ అవుతోన్న షాకింగ్ వీడియో..
Viral Video: బలహీనుడిపై బలవంతుడే గెలుస్తాడు. ఇది కాదనలేని సత్యం. సృష్టి ధర్మం కూడా ఇదే. కొన్ని అనూహ్య సంఘటనల్లో మాత్రమే బలవంతుడిపై బలహీనులు పైచేయి సాధిస్తుంటారు. కానీ మెజారీ సందర్భాల్లో బలవంతులే గెలుస్తారు. ఇది కేవలం మనుషులకే పరిమితం కాదు, జంతువులకూ...
Viral Video: బలహీనుడిపై బలవంతుడే గెలుస్తాడు. ఇది కాదనలేని సత్యం. సృష్టి ధర్మం కూడా ఇదే. కొన్ని అనూహ్య సంఘటనల్లో మాత్రమే బలవంతుడిపై బలహీనులు పైచేయి సాధిస్తుంటారు. కానీ మెజారీ సందర్భాల్లో బలవంతులే గెలుస్తారు. ఇది కేవలం మనుషులకే పరిమితం కాదు, జంతువులకూ ఇదే వర్తిస్తుంది. అడవిలోనూ బలమమైన జంతువులదే రాజ్యం. తనపై ఎలాంటి దాడి చేయదని తెలిసినా ప్రత్యర్థి జీవిపై విచక్షణ రహితంగా దాడి చేస్తుంటాయి.
తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఒళ్లు గగుర్లు పొడిచేలా ఉంది. శునకంపై పులి దాడి చేసిన సంఘటనకు సంబంధంచిన వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ నేషనల్ పార్క్‌లో పులి గాడ నిద్రలో ఉంది. అదే సమయంలో అటుగా ఓ బక్క చిక్కిన శునకం వెళ్లింది. పులిని గమనించిన శునకం దాని ముందు నుంచే వెళ్తూ.. పులివైపు ఓ లుక్కేసింది. దీంతో పులికి మేలుకువ వచ్చింది. మేలుకువ వచ్చిన పులి ఊరుకుంటుందా.? కుక్కపైకి దాడికి ప్రయత్నించింది. పులి తనకంటే బలమైందని మర్చిపోయిందో ఏమో కానీ, శునకం పరిగెత్తకుండా పులిపైకి దాడి చేయడానికి ముందుకొచ్చింది.
దీంతో ఒక్కసారిగా పంజా విసిరిన పులి.. కుక్క మెడను నోట కరిచి అక్కడి నుంచి తీసుకెళ్లింది. దీనంతటినీ పార్కులో సఫారీకి వెళ్లిన టూరిస్ట్‌లు ఫోన్‌లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్క పరిస్థితిని చూసి ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏం చేస్తాం సృష్టి ధర్మం అంటే ఇదే కదా అని అనుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..