AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో దెయ్యాన్ని క్లోజప్‌లో ఫోటో తీస్తే ఎలా ఉంటుందో తెలుసా..? సోషల్ మీడియాలో వైరల్‌ ఫోటో..

ఇక అంతే సోషల్ మీడియాలో ఫోటో హల్‌చల్‌ చేస్తోంది. చీమల ముఖానికి సంబంధించిన క్లోజప్ ఫోటో ఇలా ఉంటుందా..? అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా అన్నారు..వామ్మో ఇలాంటి పీడకలను లైవ్‌లోనే చూపించారు..అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోకరు నాకు పిల్లలు ఉంటే దెయ్యం అచ్చం ఇలాగే ఉంటుందని చెబుతాను అన్నాడు.

వామ్మో దెయ్యాన్ని క్లోజప్‌లో ఫోటో తీస్తే ఎలా ఉంటుందో తెలుసా..? సోషల్ మీడియాలో వైరల్‌ ఫోటో..
Ultra Close Up Photo
Jyothi Gadda
|

Updated on: Aug 20, 2023 | 10:14 PM

Share

దెయ్యం ఫోటో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.. కానీ, సోషల్ మీడియాలో ఒక ఫోటో నెటిజన్లను ఎంతగానో భయపెడుతోంది. అయితే, ఆ ఫోటో అతి చిన్న జీవి చీమల ముఖాన్ని చూపించే అతి క్లోజ్‌అప్ లో ఫోటో తీసినట్టుగా తెలిసింది. ఈ ఫోటో ఇప్పుడు ప్రజలకు పీడకలగా మారింది. దెయ్యం ఇలాగే ఉంటుందేమో అన్న ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫోటోను ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ జోష్ కూగ్లర్ క్లిక్ చేశారు. అతను దానిని రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. దాంతో ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. దాని భయంకరమైన ఎర్రటి కళ్ళు భయంకర రూపం ఆందోళన కలిగిస్తోంది.

చీమల ముఖానికి సంబంధించిన అల్ట్రా క్లోజప్ ఫోటోను తాను ఎలా క్లిక్ చేశానో జోష్ వివరించాడు. ఇది సాధారణ మాక్రో సెటప్ కంటే కొంచెం క్లిష్టంగా ఉంటుంది. నేను WeMacro రైలులో Nikon d7500 [కెమెరా] మరియు Laowa 25mm లెన్స్‌ని ఉపయోగించానని చెప్పారు. తాను చీమకు సంబంధించి మొత్తం 40+ ఫోటోలను తీసి మొత్తం ముఖాన్ని ఫోకస్ చేయడానికి వాటిని పేర్చినట్టుగా అతను చెప్పాడు.

ఇక అంతే సోషల్ మీడియాలో ఫోటో హల్‌చల్‌ చేస్తోంది. చీమల ముఖానికి సంబంధించిన క్లోజప్ ఫోటో ఇలా ఉంటుందా..? అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా అన్నారు..వామ్మో ఇలాంటి పీడకలను లైవ్‌లోనే చూపించారు..అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోకరు నాకు పిల్లలు ఉంటే దెయ్యం అచ్చం ఇలాగే ఉంటుందని చెబుతాను అన్నాడు.

ఇవి కూడా చదవండి

గత సంవత్సరం, డాక్టర్ యూజెనిజస్ కవలియాస్కాస్ ఒక చీమల ముఖం ఫోటోను మైక్రోస్కోప్‌లో ఐదుసార్లు పెంచారు. ఈ ఫోటో నికాన్ 2022 స్మాల్ వరల్డ్ ఫోటోగ్రఫీ పోటీలో గెలుపొందింది. ఎర్రటి కళ్లతో చీమ బంగారు కోరలు ఉన్నట్లు ఫోటోలో కనిపిస్తుంది. ఈ పోటీ మైక్రోస్కోప్ ఫోటోగ్రఫీ కళను ప్రదర్శిస్తుంది. ఇది మనిషి కన్ను చూడలేని వివరాలను సంగ్రహిస్తుంది. మొత్తానికి ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..