రాయి గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తోంది కదూ.! సరిగ్గా చూడండి, అసలు విషయం తెలిస్తే..

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తోంది. ఏముందుగా గాల్లో తేలుతోన్న ఓ రాయి అని అంటారు కదూ.! కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది నిజానికి ఆ రాయి గాల్లో ఎరగడం లేదు. సరిగ్గా గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఓసారి ఫొటోను తీక్షణంగా చూడండి రాయి ఎక్కడుందో...

రాయి గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తోంది కదూ.! సరిగ్గా చూడండి, అసలు విషయం తెలిస్తే..
Optical Illusion
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 21, 2024 | 3:01 PM

కొన్ని ఫొటోలు చూస్తుంటే.. అసలు కళ్ల ముందు కనిపిస్తోంది నిజమా, కాదా అనే భ్రమ ఏర్పడుతుంది. వీటినే ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు అంటుంటాం. ఒకటికి రెండు సార్లు చూస్తే కానీ చూసే ఫొటోలో ఉన్న అసలు విషయం అర్థం కాదు. ప్రస్తుతం ఇలాంటి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన ఫొటో నెటిజన్లను కన్ఫ్యూజ్‌కు గురి చేస్తోంది.

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తోంది. ఏముందుగా గాల్లో తేలుతోన్న ఓ రాయి అని అంటారు కదూ.! కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది నిజానికి ఆ రాయి గాల్లో ఎరగడం లేదు. సరిగ్గా గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఓసారి ఫొటోను తీక్షణంగా చూడండి రాయి ఎక్కడుందో స్పష్టమవుతుంది. ఎంత ప్రయత్నించిన ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయలేకపోతున్నారా.?

ఓసారి రాయికి ముందు గడ్డితో ఉన్న గట్టు ఉంది గమనించారా.? ఆ గట్టుకు ఆనుకొని నీటి గుంట ఉంది. ఆ నీటిలోనే ఈ రాయి ఉంది. అవును చూడ్డానికి గాల్లో ఎగురుతున్నట్లు కనిపిస్తున్న ఆ రాయి నిజానికి ఓ చిన్న నీటి గుంటలో ఉంది. నీటిలో సగం మునిగిందా రాయి. పైన ఆకాశం నీటిలో రిఫ్లెక్ట్‌ కావడంతో, రాయి నీడా నీటిలో పడడంతో అచ్చంగా రాయి గాల్లో ఎగురుతున్నట్లు కనిపిస్తోంది.

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో..

ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోను మాస్సిమో అనే ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేయగా, నెటిజన్లను కన్ఫ్యూజ్‌కు గురి చేస్తోంది. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు మీ మెదడును ఎలా కన్ఫ్యూజ్‌ చేస్తాయో చెప్పేందుకు ఈ ఫొటో బెస్ట్‌ ఉదాహరణ, ముందు మీకు రాయి గాల్లో ఎగురుతున్నట్లు కనిపిస్తోంది కదూ.. సరిగ్గా చూస్తే అసలు విషయం తెలుస్తుంది’ అని రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..