AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సైక్లింగ్‌కు వెళితే ఎదురైన జిరాఫీ.. తర్వాత ఏం జరిగిందో అస్సలు ఊహించరు

తనను తాను రక్షించుకోవడానికో, మనుషుల నుంచి తనకు ప్రమాదం ఉందని అనుకొనో... కారణం ఏదైనా జంతువులు మనుషులపై దాడికి దిగుతాయి. అయితే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే మాత్రం దీనికి భిన్నమైన సంఘటన జరిగింది. ఓ యువకుడు, యువతి అటవీ ప్రాంతంలో...

Viral Video: సైక్లింగ్‌కు వెళితే ఎదురైన జిరాఫీ.. తర్వాత ఏం జరిగిందో అస్సలు ఊహించరు
Viral Video
Narender Vaitla
|

Updated on: Jan 21, 2024 | 3:26 PM

Share

సాధారణంగా జూలలో ఉండే జంతువులు మనుషులను పెద్దగా ఏమి అనవు. కొన్ని సందర్భాల్లో అవి కూడా దాడి చేస్తాయి. మరి అలాంటిది అడవిలో ఉండే జంతువులు ఎదురు పడితే.. ఏమైనా ఉందా. వెంటనే దాడి చేస్తాయని అనుకుంటాం కదూ! చాలా వరకు క్రూర మృగాలు, మనిషి కంటే బలంగా ఉన్న జంతువు ఏదైనా దాడి చేస్తుంది.

తనను తాను రక్షించుకోవడానికో, మనుషుల నుంచి తనకు ప్రమాదం ఉందని అనుకొనో… కారణం ఏదైనా జంతువులు మనుషులపై దాడికి దిగుతాయి. అయితే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే మాత్రం దీనికి భిన్నమైన సంఘటన జరిగింది. ఓ యువకుడు, యువతి అటవీ ప్రాంతంలో సైక్లింగ్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో వారికి ఎదురుగా ఓ జిరాఫీ ఎదురు పడింది. సాధారణంగా అయితే జిరాఫీ వారిపై దాడి చేస్తుందని అనుకుంటాం కదూ! అయితే దీనికి భిన్నంగా జరిగింది.

అనుకోని అతిథిగా జిరాఫీ ఎదురు పడగానే సైక్లింగ్ చేస్తున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా వెనుకడుగు వేశాడు. జిరాఫీ దాడి చేస్తుందేమోనన్న భయంతో వెనక్కి వెళ్దామని చూశాడు. అయితే ఆ జిరాఫీ మాత్రం ఆ యువకుడి దగ్గరకు మెల్లిగా వచ్చింది. అస్సుల ఎలాంటి హాని తలపెట్టకుండా, యువకుడి భుజంపై నెమిరింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

వైరల్ వీడియో..

ఇదంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగానే వీడియో నెట్టింగ తెగ వైరల్‌ అయ్యింది. గంటల్లోనే వేలాది మంది ఈవీడియోను చూశారు. నేచర్‌ ఇజ్‌ అమేజింగ్ అనే ట్విట్టర్‌ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘వాటిని మనం గౌరవిస్తే, అవి మనల్ని గౌరవిస్తాయి’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు సైతం ఈ మాటకు అంగీకరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..