Viral News: ఈ యువతి వెరీ వెరీ స్పెషల్ గురూ.. ఒక్క ప్రశ్న అడిగి.. ఏడాదిలో రూ. 8 కోట్లను సంపాదిస్తోందిగా..

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. హన్నా ఆమె భర్త డేనియల్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్లు. రెండేళ్ళ క్రితం సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని తెలియగానే ఈ దంపతులకు కూడా ఆసక్తి కలిగింది. తము కూడా అదే పని చేసి లక్షల్లో సంపాదించాలని నిర్ణయించుకున్నారు. డేనియల్ రోడ్డుమీద వెళ్తున్న వారిని ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. అప్పుడు అవతి వారు చెప్పిన సమాధానాలను హన్నా, ఆమె భర్త కెమెరాలో రికార్డ్ చేస్తారు. అంతేకాదు వారు చేసే పని గురించి చెబుతారు

Viral News: ఈ యువతి వెరీ వెరీ స్పెషల్ గురూ.. ఒక్క ప్రశ్న అడిగి.. ఏడాదిలో రూ. 8 కోట్లను సంపాదిస్తోందిగా..
UK woman earned over 8 croreImage Credit source: salarytransparentstree
Follow us
Surya Kala

|

Updated on: Jan 21, 2024 | 3:58 PM

డబ్బు సంపాదించడం అంత తేలికైన పని కాదని కొందరు చెబుతారు. అయితే కొందరిని చూస్తుంటే డబ్బులు సంపాదించడం చాలా తేలికైన పని అని అనిపిస్తుంది. ఎవరు కోటీశ్వరులు అవ్వాలని కోరుకోరు చెప్పండి. అయితే కోట్లకు అధిపతి అయ్యే అవకాశం, అదృష్టం అందరికీ ఉండదు. కొంతమంది జీవితాంతం సంపాదిస్తునే ఉంటారు. ఇలా మహా అయితే తమ జీవితంలో ఒకటి లేదా రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఆదా చేయగలుగుతారు. అయితే ఎవరూ ఊహించని పని చేస్తూ కేవలం కొన్ని సంవత్సరాలలో లేదా కొన్ని నెలలలో లక్షాధికారులుగా మారే కొందరు వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుతం అలాంటి మహిళ గుర్తించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ప్రజలను ఒకే ప్రశ్న వేసి కోట్ల రూపాయలను సంపాదించింది.

ఈ మహిళ పేరు హన్నా విలియమ్స్. ఆమె బ్రిటన్ నివాసి. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. హన్నా ఆమె భర్త డేనియల్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్లు. రెండేళ్ళ క్రితం సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని తెలియగానే ఈ దంపతులకు కూడా ఆసక్తి కలిగింది. తము కూడా అదే పని చేసి లక్షల్లో సంపాదించాలని నిర్ణయించుకున్నారు. డేనియల్ రోడ్డుమీద వెళ్తున్న వారిని ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. అప్పుడు అవతి వారు చెప్పిన సమాధానాలను హన్నా, ఆమె భర్త కెమెరాలో రికార్డ్ చేస్తారు. అంతేకాదు వారు చేసే పని గురించి చెబుతారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. హన్నా వీడియోలు షేర్ చేస్తూ లక్షలు కాదు కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఒక్క ఏడాదిలోనే 8 కోట్ల ఆదాయం

27 ఏళ్ల హన్నా కేవలం ఒక సంవత్సరంలోనే 10 లక్షల 43 వేల డాలర్లు అంటే దాదాపు మన దేశపు కరెన్సీలో రూ. 8 కోట్ల 67 లక్షలు సంపాదించినట్లు చెబుతోంది. హన్నా స్వయంగా తన సంపాదనను సోషల్ మీడియాలో ద్వారా ప్రజలకు తెలియజేసింది. దీంతో జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

94 లక్షల విలువైన ఉద్యోగాన్ని వదిలి వీడియోలు

నివేదికల ప్రకారం హన్నా బాగా చదువుకుంది. కంటెంట్ క్రియేషన్ ప్రపంచంలోకి ప్రవేశించే ముందు.. డేటా అనలిస్ట్‌గా పనిచేసిం. అక్కడ ఆమె జీతం సంవత్సరానికి రూ. 94 లక్షలు. అయితే ఆమె 2022 సంవత్సరంలో ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఉద్యోగం మానేయడానికి చాలా సంకోచించానని.. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుని ఉద్యోగం మానేసి పూర్తిగా వీడియోలు తీసే పనిలో నిమగ్నమైనట్లు వెల్లడించింది. దీని వల్లే ఈరోజు భర్తతో పాటు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నానని హన్నా చెప్పుకొచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..