AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓ స్త్రీ రామ నామ జపం చేస్తుండగా వానరం ఎంట్రీ.. అద్భుత దృశ్యం చూడాలంటే వీడియోపై ఓ లుక్ వేయండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక మహిళ..  కోతికి సంబంధించినది. ఇది చూసి ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. ఒక భక్తురాలు రామ నామస్మరణ చేస్తూ కూర్చొని ఉంది. అప్పుడు అకస్మాత్తుగా కుంటుతున్న ఒక కోతి అక్కడికి వచ్చి ఆ స్త్రీని కౌగిలించుకుంది. ఈ దృశ్యం అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

Viral Video: ఓ స్త్రీ రామ నామ జపం చేస్తుండగా వానరం ఎంట్రీ.. అద్భుత దృశ్యం చూడాలంటే వీడియోపై ఓ లుక్ వేయండి..
Moneky Video
Surya Kala
|

Updated on: Jan 20, 2024 | 4:33 PM

Share

ప్రస్తుతం దేశం మొత్తం రామ నామ స్మరణతో మారుమ్రోగుతోంది. అంతా రామమయం.. జగమంతా రామ మయంగా మారింది. ఈ నేపథ్యంలో అయోధ్య నుంచి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి అనేక రకాల చిత్రాలు, వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. వీరిని చూడగానే హృదయానికి సంతోషం కలుగుతుంది. కొన్ని చోట్ల రామ నామస్మరణ చేస్తూ, కొన్ని చోట్ల భజనలు పాడుతూ కనిపిస్తున్నారు. విదేశాల నుంచి కూడా రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తాము కూడా రామమందిరాన్ని దర్శించుకోవాలనుకుంటున్నామని తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక మహిళ..  కోతికి సంబంధించినది. ఇది చూసి ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. ఒక భక్తురాలు రామ నామస్మరణ చేస్తూ కూర్చొని ఉంది. అప్పుడు అకస్మాత్తుగా కుంటుతున్న ఒక కోతి అక్కడికి వచ్చి ఆ స్త్రీని కౌగిలించుకుంది. ఈ దృశ్యం అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

ఒక భక్తురాలు తన ఇంట్లో కూర్చుని దేవుడి విగ్రహం ముందు రాముని నామాన్ని జపిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో ఒక కోతి కుంటుకుంటూ అక్కడికి చేరుకుని నేరుగా ఆ స్త్రీ కౌగిలికి చేరుకుంది. ఆ తర్వాత ఆ స్త్రీని అంటిపెట్టుకుని.. ఆమె ఒడిలో ఒక పసి పిల్లాడిలా పడుకుంది. ఈ దృశ్యం ఎవరి హృదయాన్ని అయినా హత్తుకునే విధంగా ఉంది.. చూడగానే ఎవరికైనా సంతోషంతో కన్నీళ్లు వచ్చేంత అద్భుతంగా ఉంది.  ఇటు వంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

రామనామ జప సమయంలో కోతి

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @JIX5A IDలో షేర్ చేశారు. ‘రామనామం జపిస్తున్న సమయంలో అద్భుతం జరిగింది. ఒక కోతి ఇంట్లోకి ప్రవేశించింది.. నిజంగా భక్తురాలు రామయ్య ఆశీర్వాదం పొందింది. జై శ్రీరామ్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఒక నిమిషం 46 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా వీక్షించగా, 11 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత నాకు నిజంగా కన్నీళ్లు వచ్చాయి’ అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు ‘హృదయానికి హత్తుకునే వీడియో’ అని.. ‘సనాతన ధర్మం అంటే ఇదే. అందంగా ఉంది వీడియో అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!