Viral: ప్రయాణికుడి చెంప పగలగొట్టిన టీటీఈ.! ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
కొందరు అనేక కారణాలతో టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తుంటారు. టీటీఈ వచ్చినప్పుడు దొరికిపోతుంటారు. ఆపైన ఫైన్ కడతారు. కానీ, తాజాగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిపై టీటీఈ చేయి చేసుకున్నాడు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నందుకు ఆ ప్రయాణికుడి చెంపపై చెడామడా కొట్టేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తో టీటీఈపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
కొందరు అనేక కారణాలతో టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తుంటారు. టీటీఈ వచ్చినప్పుడు దొరికిపోతుంటారు. ఆపైన ఫైన్ కడతారు. కానీ, తాజాగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిపై టీటీఈ చేయి చేసుకున్నాడు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నందుకు ఆ ప్రయాణికుడి చెంపపై చెడామడా కొట్టేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తో టీటీఈపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి టికెట్ లేకుండా బరౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. టికెట్లు తనిఖీ చేసే టీటీఈ ఈ విషయాన్ని గుర్తించాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తిని దారుణంగా తిట్టడంతోపాటు అతడి చెంపపై పలుమార్లు కొట్టాడు. ఆ రైలులో ప్రయాణించిన కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు. వారిని కూడా అడ్డుకునేందుకు టీటీఈ ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందించారు. టికెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తిది తప్పేనని, అయితే టీటీఈ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని అతడిని దారుణంగా కొట్టడం తగదని అభిప్రాయపడ్డారు. ఆ టీటీఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైల్వే మంత్రికి ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ఈ సంఘటనపై స్పందించారు. ఆ టీటీఈని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

