Viral Video: స్మార్ట్ ఫోన్ తర్వాతే ఏదైనా.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర.
అయితే అవసరాలకు ఉపయోగపడుతున్న ఇదే స్మార్ట్ ఫోన్ మనుషుల మధ్య బంధాలను, సామాజిక జీవితంపై దుష్ప్రభావం చూపుతుంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. సమాజంలో జరిగే ప్రతీ చిన్న అంశంపై స్పందించే ప్రముఖ పారిశ్రామికవేత్త...

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ఆమాటకొస్తే పక్కనున్న వ్యక్తుల కంటే స్మార్ట్ ఫోన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న రోజులివీ. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వారే స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడిచే పరిస్థితి లేదు. మారిన టెక్నాలజీ, అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారింది.
అయితే అవసరాలకు ఉపయోగపడుతున్న ఇదే స్మార్ట్ ఫోన్ మనుషుల మధ్య బంధాలను, సామాజిక జీవితంపై దుష్ప్రభావం చూపుతుంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. సమాజంలో జరిగే ప్రతీ చిన్న అంశంపై స్పందించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ వీడియో పలువురిని ఆలోజింపచేస్తోంది.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందగానే.. ఓ తల్లి తన చిన్నారి తినేందుకు ప్లేట్‌లో వడను పోలిన ఆహారపదార్థాన్ని పెట్టింది. అయితే ఆ డ కాస్త పొడవుగా ఉండడంతో చిన్నారి ఫోన్‌గా భ్రమించిందో ఏమో.. వెంటనే దాన్ని తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంది. దీనంతటినీ వీడియో తీసిన పేరెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట తెగ వైరల్ అయిన ఈ వీడియో కాస్త ఆనంద్ మహీంద్ర కంట పడింది. దీంతో వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియో..
Oh no, no, no….
It’s true. Our species has irreversibly mutated..
It’s now PHONE, and only AFTER that Roti, Kapda aur Makaan…! pic.twitter.com/49PmgGOYDV
— anand mahindra (@anandmahindra) January 20, 2024
ఈ చిన్నారి వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర.. ‘ఇది నిజం.. మానవ జాతి మారిపోయింది. ఈ చిన్నారికి ఇప్పుడు ఫోన్ కావాలి. ఆ తర్వాతే రోటీ, దుస్తులు, ఇల్లు ఏదైనా’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు నిజంగానే పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
