Aydhya: బాల రామయ్య ప్రాణ ప్రతిష్టకు కౌంట్ డౌన్ స్టార్ట్.. అత్తారిల్లు సహా దేశవ్యాప్తంగా ముస్తాబైన ఆలయాలు.. వీడియోలు వైరల్

అయోధ్యరాముని ప్రాణప్రతిష్ఠ వేడుకలకు దేశవ్యాప్తంగా పలు నగరాలు కూడా ముస్తాబయ్యాయి. దేశంలో ప్రసిద్ధి పొందిన కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన లైట్ షోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ లో వేలాది దీపాలతో సియావర్ రామచంద్ర కీ జై అంటూ నినదించారు

Aydhya: బాల రామయ్య ప్రాణ ప్రతిష్టకు కౌంట్ డౌన్ స్టార్ట్.. అత్తారిల్లు సహా దేశవ్యాప్తంగా ముస్తాబైన ఆలయాలు.. వీడియోలు వైరల్
celebrations in different cities
Follow us
Surya Kala

|

Updated on: Jan 21, 2024 | 12:59 PM

అయోధ్యనగరంలో మరి కొద్దిగంటల్లో బాలరాముడు తనమందిరంలో ఆవిష్కృతం కానున్నాడు. ప్రధాని నరేంద్రమోదీ తొలి దర్శనం చేసుకోనున్నారు. మోదీ చేతులమీదుగా ఆవిష్కృతం కానున్న బాలరాముడిని వివిధ మార్గాలలో యావత్‌ ప్రపంచం దర్శించనుంది. ఈ క్రమంలో బాల రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామ జన్మభూమి అయోధ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్‌ దీప కాంతులతో నగరం మెరిసిపోతూ.. 500 ఏళ్ల కల సాకారమైన ఆనందంతో అయోధ్యపురి పులకించిపోతోంది.

రామ మందిరం ప్రవేశ ద్వారాన్ని పూలతో అలంకరించారు. వీధుల్లో తోరణాలు, గోడలపై రామాయణ గాథను తెలిపే చిత్రాలతో అయోధ్య నగరం మెరిసిపోతోంది. కాగా, అయోధ్యతో పాటు దేశవిదేశాల్లోనూ సంబరాలు జరుగనున్నాయి. అయోధ్యరాముని ప్రాణప్రతిష్ఠ వేడుకలకు దేశవ్యాప్తంగా పలు నగరాలు కూడా ముస్తాబయ్యాయి. దేశంలో ప్రసిద్ధి పొందిన కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

పలుచోట్ల ఏర్పాటు చేసిన లైట్ షోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ లో వేలాది దీపాలతో సియావర్ రామచంద్ర కీ జై అంటూ నినదించారు. చాందా క్లబ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరిగింది. జమ్మూకశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవీ ఆలయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతోంది.

శ్రీరాముడి అత్తారిళ్లు నేపాల్ లోని జనక్ పూర్ లోనూ సంబరాలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల దీపాలంకరణలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రజలను మరింత భక్తిపారవశ్యానికి గురిచేస్తున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..