Ayodhya: 45 రోజుల్లో రూ. 2500 కోట్లు.. రామాలయం కోసం పది కోట్ల మంది విరాళాలు.. అత్యధికంగా ఎవరు ఇచ్చారంటే..

రామ మందిర నిర్మాణం అనగానే భారీగా రామ భక్తులు విరాళాలను ప్రకటించారు. కేవలం 45 రోజుల్లోనే 10 కోట్ల మందికి పైగా విరాళాలు అందించారు. ఈ మొత్తం 2500 కోట్ల రూపాయలు. ఇదే విషయంపై మార్చిలో, విశ్వహిందూ పరిషత్ కేంద్ర ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (ట్రస్ట్) ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి జనవరి 14 వ తేదీ 2021లో ప్రపంచంలోనే అతిపెద్ద విరాళాల సేకరణ కార్యక్రమం మొదలు పెట్టి ఫిబ్రవరి 27, 2021న ముగిసిందని వెల్లడించారు.

Ayodhya: 45 రోజుల్లో రూ. 2500 కోట్లు..  రామాలయం కోసం పది కోట్ల మంది విరాళాలు.. అత్యధికంగా ఎవరు ఇచ్చారంటే..
రకరకాల బంతి పువ్వులు అలంకరణలో ప్రముఖ స్థానాన్ని చోటు చేసుకున్నాయి. వీటితో పాటు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల పూలను వాడారు.
Follow us
Surya Kala

|

Updated on: Jan 21, 2024 | 12:59 PM

అయోధ్యలో రామ జన్మ భూమిలో బాల రామయ్య విగ్రహ ప్రతిష్ట వేడుకకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట వేడుక జరగనుంది. ఈ వేడుక్కి అయోధ్య నగరం సిద్ధమైంది. చారిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గొప్ప ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. రామ మందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ (VHP) విరాళాలను సేకరించారు. 2019లో సుప్రీంకోర్టు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంపై మొదటి కోర్టు కేసు దాఖలైన దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఈ ఉత్తర్వు వచ్చింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ట్రస్టుకు బదలాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణానికి అయోధ్యలో ముస్లింలకు ఐదు ఎకరాలు కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయోధ్యలో బ్రహ్మాండమైన రామ మందిర నిర్మాణానికి సుమారు రూ. 1,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఫిబ్రవరి 5, 2020 నుంచి మార్చి 31, 2023 మధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ రూ. 900 కోట్లు ఖర్చు చేసిందని గత ఏడాది రామ జన్మ భూమి ట్రస్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్ట్ 5, 2020న రామాలయానికి శంకుస్థాపన చేశారు. శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న రామ మందిర నిర్మాణం మొదటి అంతస్తులోని గర్భ గుడిలో ప్రధాన దైవంగా బాల రాముడు కొలువుదీరనున్నాడు. రేపు పవిత్రోత్సవం జరుగుతుంది.

‘ప్రపంచంలోనే అతిపెద్ద విరాళాల డ్రైవ్’

రామ మందిర నిర్మాణం అనగానే భారీగా రామ భక్తులు విరాళాలను ప్రకటించారు. కేవలం 45 రోజుల్లోనే 10 కోట్ల మందికి పైగా విరాళాలు అందించారు. ఈ మొత్తం 2500 కోట్ల రూపాయలు. ఇదే విషయంపై మార్చిలో, విశ్వహిందూ పరిషత్ కేంద్ర ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (ట్రస్ట్) ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి జనవరి 14 వ తేదీ 2021లో ప్రపంచంలోనే అతిపెద్ద విరాళాల సేకరణ కార్యక్రమం మొదలు పెట్టి ఫిబ్రవరి 27, 2021న ముగిసిందని వెల్లడించారు.

‘శ్రీరామ మందిర నిధి సమర్పణ’

  1. “దేశంలోని మూలమూలలో ఉన్న రామభక్తులు భవ్య మైన రామ మందిర నిర్మాణం కోసం తమ విరాళాలను అందించారు.
  2. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం నుండి అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు రూ. 4.5 కోట్లు, మణిపూర్ రూ. 20 కోట్లు, మిజోరం రూ. 2.1కోట్లు, నాగాలాండ్ రూ. 2.8 కోట్లు, మేఘాలయ రూ. 8.5 కోట్లు విరాళంగా అందగా..
  3. ఇవి కూడా చదవండి
  4. దక్షిణాది రాష్ట్రాల్లోని తమిళనాడు ప్రజలు రూ. 85 కోట్లు, కేరళ రూ. 13 కోట్లను అందించారు అని చంపత్ రాయ్ తెలిపారు.

విరాళాలు ఇచ్చిన బిచ్చగాళ్ళు

  1. 400 వేర్వేరు ప్రదేశాల నుండి ఏకకాలంలో విరాళాలను సేకరించారు. ఇలా మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి వీహెచ్పీ మొదలు పెట్టింది.
  2. కోవింద్ తమ ఫ్యామిలీ తరపున రూ. 5,00,100 విరాళాన్ని అందించారు. అనంతరం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు దీనిని అనుసరించారు.
  3. పలువురు రాష్ట్ర గవర్నర్లు, సిఎంలు కూడా ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించారు.
  4. సేకరణ మొదలు పెట్టిన 11 నెలల్లోనే, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దాదాపు ₹100 కోట్లకు పైగా వసూలు చేసింది.
  5. అయితే యుఎస్ లో ఉన్న గుజరాత్‌కు చెందిన ఆధ్యాత్మిక నాయకుడు మొరారీ బాపు తన అనుచరులతో అత్యధికంగా ₹11.3 కోట్ల విరాళాన్ని అందించారు. కెనడా, UKన నుంచి రూ. 8 కోట్లు వసూలు అయ్యాయి.
  6. చాలా చోట్ల యాచకులు, దినసరి కూలీలు, చిన్న రైతులు కూడా రామయ్యపై భక్తీ శ్రద్ధలను కనబరుస్తూ మందరి నిర్మాణంలో మేము సైతం అన్నారని చెప్పారు.

ఇంటింటికి ప్రచారం

ఈ బృహత్తర కార్యాన్ని నెరవేర్చేందుకు దాదాపు 9 లక్షల మంది కార్యకర్తలు 1,75,000 బృందాలుగా విడిపోయి ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం విరాళాలను సేకరించారని వీహెచ్‌పీ కేంద్ర ఉపాధ్యక్షుడు తెలిపారు. తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి మొత్తం బృందం ఏకాభిప్రాయంతో పనిచేసిందని చెప్పారు.

ఈ బృహత్ కార్యక్రమంలో మొత్తం 38,125 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. వీరు సేకరించిన విరాళం మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు రాయ్ తెలిపారు. ఈ విరాళాల సేకరణ విషయంలో పారదర్శకతను కొనసాగించడానికి దేశవ్యాప్తంగా 49 కంట్రోల్ రూమ్‌లు పని చేశాయని వెల్లడించారు. ఢిల్లీలోని ప్రధాన కేంద్రంలో ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్ల నేతృత్వంలోని 23 అర్హత కలిగిన కార్యకర్తలు ఖాతాలను పర్యవేక్షించడానికి నెట్‌వర్క్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..