Ayodhya: సప్తవర్ణాల శోభితంగా రామాలయం.. రకరకాల పువ్వులతో నగరంతో సహా అనేక ప్రాంతాలు అలంకారణ.. అందమైన పిక్స్ పై ఓ లుక్ వేయండి..
అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు సన్నాహాలు పూర్తయ్యాయి. నగరంలోని చిన్న పెద్ద ఆలయాలను అలంకరించారు. నగరం సహా రామ మందిరాన్ని ఆదివారం సాయంత్రానికి పూర్తిగా అలంకరించనున్నారు. ఆలయాన్ని అలంకరించేందుకు దేశంలోని ప్రముఖ ప్రాంతాల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా పూలు తెప్పించారని తెలుస్తోంది. రామ మందిర సౌందర్యాన్ని పెంచే అనేక ప్రత్యేక రకాల పూలు వీటిలో ఉన్నాయి. రామాలయం లోపల జరుగుతున్న రకరకాల అలంకరణల చిత్రాలు కూడా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. వాటిలో వివిధ రకాల పుష్పాలు కనిపిస్తాయి.