- Telugu News Photo Gallery This is the specialty of Sarayu river flowing in Ayodhya, check here is details in Telugu
Ayodhya Ram Mandir: అయోధ్యలో ఉండే సరయు నది ప్రత్యేకత ఇదే.. అన్ని పాపాలూ పోతాయి!
దేశ వ్యాప్తంగా అయోధ్య రామ మందిరం గురించి చర్చ నడుస్తోంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశ వ్యాప్తంగా అందరూ ఎందురు చూస్తున్నారు. రాముని ప్రాణ ప్రతిష్ఠను దేశ వ్యాప్తంగా పండుగలా జరుపుతున్నారు. ఎక్కడ చూసినా రామ మందిరం గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ ప్రవహించే సరయూ నది గురించి, దాని ప్రాముఖ్యత గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. సరయూ నది అయోధ్యకు ఉత్తరాన ప్రవహిస్తుంది. సరయు నదిలో స్నానం ఆచరిస్తే.. అన్ని పుణ్య క్షేత్రాలను దర్మించినంత..
Updated on: Jan 21, 2024 | 3:21 PM

దేశ వ్యాప్తంగా అయోధ్య రామ మందిరం గురించి చర్చ నడుస్తోంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశ వ్యాప్తంగా అందరూ ఎందురు చూస్తున్నారు. రాముని ప్రాణ ప్రతిష్ఠను దేశ వ్యాప్తంగా పండుగలా జరుపుతున్నారు. ఎక్కడ చూసినా రామ మందిరం గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ ప్రవహించే సరయూ నది గురించి, దాని ప్రాముఖ్యత గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే.

సరయూ నది అయోధ్యకు ఉత్తరాన ప్రవహిస్తుంది. సరయు నదిలో స్నానం ఆచరిస్తే.. అన్ని పుణ్య క్షేత్రాలను దర్మించినంత పుణ్యం లభిస్తుందని అక్కడి వారు అంటున్నారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ నదిలో స్నానం చేసిన వ్యక్తిని అన్ని తీర్థాల దర్శన ఫలాలు లభిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

పురాణాల ప్రకారం.. సరయు, శారదా నదుల సంగమం ఇప్పటికే జరిగింది. సరయు నది విష్ణువు కన్నుల నుంచి ఉద్భవించింది. పూర్వ కాలంలో శంఖాసురుడు అనే రాక్షసుడు.. వేదాలను దొంగిలించి సముద్రంలో పడేసి దాక్కున్నాడు. దీంతో విష్ణు మూర్తి మత్స్య అవతారంలో వచ్చి రాక్షసుడిని సంహరించి.. వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు.

ఆ సమయంలోనే విష్ణు మూర్తికి ఆనంద బాష్పాలు వచ్చాయి. వీటిని బ్రహ్మ మానస సరోవరంలో భద్ర పరిచాడు. మహా బలవంతుడైన మహా రాజు వైవస్వత.. తన బాణంతో ఈ నీటిని బయటకు తీశాడు. ఈ నీటి ప్రవాహాన్నే సరయు అని పిలుస్తారని పురాణం చెబుతుంది.

అదే విధంగా సరయు నది నీటిని శివ పూజకు ఉపయోగించరు. సరయు నదికి శివుడు ఒక శాపం పెట్టాడట. అందుకు వీటిని శివ పూజకు యూజ్ చేయరు. కానీ ఈ నదిలో స్నానం చేస్తే.. పాపాలు తొలగి అన్ని పుణ్య క్షేత్రాలను దర్మించినంత ఫలితం ఉంటుందని చెబుతారు.




