Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్యకు ‘హనుమాన్’ భారీ విరాళం.. ఏకంగా అన్ని కోట్లు..
సినిమా రిలీజ్‌కు ముందే హనుమాన్ టీమ్ ఒక కీలక ప్రకటన చేసింది. 'హనుమాన్' మూవీకి సంబంధించి ప్రతి టికెట్‌పై వచ్చే ఆదాయంలో 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రబృందం ప్రకటించింది. మాటిచ్చినట్లుగానే ఇదివరకే ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన వసూళ్లలో రూ. 14,85,810 రూపాయలను అయోధ్య రామయ్యకు విరాళంగా అందించారు.
అంజనేయ స్వామి కథకు, సూపర్ హీరోకు ముడిపెట్టి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో మెరిసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే రూ. 150 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ రూ.200 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ ఈ స్థాయి వసూళ్లు సాధిస్తుండడం ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్‌కు ముందే హనుమాన్ టీమ్ ఒక కీలక ప్రకటన చేసింది. ‘హనుమాన్’ మూవీకి సంబంధించి ప్రతి టికెట్‌పై వచ్చే ఆదాయంలో 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రబృందం ప్రకటించింది. మాటిచ్చినట్లుగానే ఇదివరకే ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన వసూళ్లలో రూ. 14,85,810 రూపాయలను అయోధ్య రామయ్యకు విరాళంగా అందించారు. ఇక సోమవారం (జనవరి 22) అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈనేపథ్యంలో మరోసారి అయోధ్య రామయ్యకు భారీ విరాళమిచ్చింది హనుమాన్ చిత్ర బృందం. ఇప్పటివరకు తమ సినిమాకు సంబంధించి 53,28,211 టికెట్లు అమ్ముడయ్యాయట. వీటి ద్వారా వచ్చిన ఆదాయంలో 2,66,41,055 రూపాయలను బాల రాముడికి విరాళంగా అందజేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.
హనుమాన్ చిత్ర బృందం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నారంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. . ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి హనుమాన్ సినిమాను నిర్మించారు. వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా మెరిశాడు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శీను తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వర్క్ చేశారు.
2.66 కోట్లతో..
#HANUMAN for SHREE RAM ✨
As announced, Team HanuMan is going to donate a grand sum of ₹2,66,41,055 for 53,28,211 tickets sold so far for Ayodhya Ram Mandir 🤩🙏
A @PrasanthVarma film 🌟ing @tejasajja123#HanuManForShreeRam #HanuManEverywhere… pic.twitter.com/jbWQ5sPhzq
— Primeshow Entertainment (@Primeshowtweets) January 21, 2024
Embark on a mesmerizing cinematic journey at the brand-new #AsianVaishnaviMultiplex in RC Puram! ✨
Sensational BLOCKBUSTER #Hanuman duo, @PrasanthVarma, and @tejasajja123 set the stage for unlimited entertainment by inaugurating it. ❤️🎬@AsianCinemas_ @AsianSuniel… pic.twitter.com/hBEJX44YAD
— BA Raju’s Team (@baraju_SuperHit) January 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.