Ayodhya: బాల రాముడి ప్రతిష్ట వేళ.. కళాకారుడి అపురూప సృష్టి.. రామయణం వర్ణించే సూక్ష్మ చిత్రల పెయింటింగ్
చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ దాదాపు 500 సంవత్సరాల నుంచి అయోధ్య కోసం పోరాటం జరుగుతుందని, హిందూమత ఆరాధ్య దైవం శ్రీరాముడి ఆలయం చూడాలని కోట్లాది మంది , భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని ఆ కల ఇప్పుడు నెరవేరిందని.. జనవరి 22న అయోధ్యలో రాముని మందిరం ప్రాణ ప్రతిష్ట జరగడం ఆనందంగా ఉందన్నారు.
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట సందర్భంగా అద్భుతమైన చిత్రాన్ని వేసి అందరిని అబ్బర పరిచారు. ఏత్రీ డ్రాయింగ్ షీట్ పై ఒకే చిత్రంలో రామయణంలోని ముఖ్యమై ఘట్టాలను సూక్ష్మ మైన చిత్రాలతో అయోధ్య రామమందిరం చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.
ఈ చిత్రాన్ని వాటర్ కలర్స్ తో దాదాపు 8 గంటల పాటు శ్రమించి రాముడి పై ప్రేమ, భక్తి శ్రద్ధలతో ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు కోటేష్ తెలిపారు. ఈ చిత్రంలో శ్రీరాముని జననం నుండి సీతాదేవి అగ్ని పరీక్ష వరకు జరిగిన పలు ఘట్టాల సన్నివేశాలను అత్యంత అద్బుతంగా, అందరికి అర్థం అయ్యేలా చిత్రకారుడు చిత్రాలను వేయడం జరిగింది.
ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ దాదాపు 500 సంవత్సరాల నుంచి అయోధ్య కోసం పోరాటం జరుగుతుందని, హిందూమత ఆరాధ్య దైవం శ్రీరాముడి ఆలయం చూడాలని కోట్లాది మంది , భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని ఆ కల ఇప్పుడు నెరవేరిందని.. జనవరి 22న అయోధ్యలో రాముని మందిరం ప్రాణ ప్రతిష్ట జరగడం ఆనందంగా ఉందన్నారు.
దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు.. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు. రామయణం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. రాముని బొమ్మలు ఎన్నిసార్లు “వేసిన వేయాలని పిస్తుంది. ఈ చిత్రం ఆ శ్రీరాముని పాదాలకు అంకితం అంటూ చిత్రకారుడు శ్రీరాముడి పై తన ప్రేమను వెలిబుచ్చారు.
ఈ చిత్రాన్ని పరిశీలించి చూస్తే రామయణం అంత కనిపిస్తుంది. జై శ్రీరామ్… జై జై.. శ్రీరామ్ అంటు చిత్రకారుడు తన భక్తిని, ప్రేమను చెప్పకనే చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..