Ayodhya Akshatalu: అయోధ్య నుంచి అక్షతలు అందాయా..! ఎలా ఉపయోగించాలో తెలుసా..!
విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా రామభక్తులు ఇంటింటికీ వెళ్లి బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆహ్వాన పత్రికలను ప్రజలకు అందజేశారు. ఆ ఆహ్వాన పత్రికలతో పాటు అక్షతలను కూడా పంచారు. అయితే రామ మందిరం నుంచి వచ్చిన ఈ అక్షతలను ఏం చేయాలో తెలుసా.. ఈ అక్షతలను ఎలా ఎక్కడ ఎక్కడ ఉపయోగించాలి ఈ రోజు తెలుసుకుందాం.. రామయ్య జీవిత పవిత్రోత్సవానికి ఆహ్వానంగా అందుకున్న అక్షతలను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏదైనా శుభ కార్యం చేసే ముందు ఈ అక్షతలను తలపై వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ పని అయినా సులభంగా పూర్తి అవుతుంది.
అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో బాల రాముడి పవిత్రోత్సవం సందర్భంగా రామభక్తులలో చాలా ఉత్సాహం నెలకొంది. రామ్ లల్లా ప్రతిష్టాపన దీక్షకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ సమయంలో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రేపు అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో బాల రామయ్య ను ప్రతిష్టించనున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా రామభక్తులు ఇంటింటికీ వెళ్లి బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆహ్వాన పత్రికలను ప్రజలకు అందజేశారు. ఆ ఆహ్వాన పత్రికలతో పాటు అక్షతలను కూడా పంచారు. అయితే రామ మందిరం నుంచి వచ్చిన ఈ అక్షతలను ఏం చేయాలో తెలుసా.. ఈ అక్షతలను ఎలా ఎక్కడ ఎక్కడ ఉపయోగించాలి ఈ రోజు తెలుసుకుందాం..
రామయ్య జీవిత పవిత్రోత్సవానికి ఆహ్వానంగా అందుకున్న అక్షతలను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏదైనా శుభ కార్యం చేసే ముందు ఈ అక్షతలను తలపై వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ పని అయినా సులభంగా పూర్తి అవుతుంది.
అంతేకాదు రామమందిరం నుంచి అందుకున్న అక్షతలను ఇంటిలో అక్షతలతో కలుపుకుని ఉపయోగించవచ్చు. దేవునికి సమర్పించవచ్చు. అంతే కాకుండా ఎప్పుడైనా పాయసం తయారు చేసుకుంటే ఈ అక్షతలను వేసి తాయారు చేసుకోవచ్చు. దేవుడికి సమర్పించి ఈ ప్రసాదాన్ని కుటుంబంతో కలిసి సేవించండి. ఇలా చేయడం వలన కుటుంబంలో మధురానుభూతిని పెంచుతుందని పండితులు చెబుతున్నారు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి సమస్యలన్నీ దూరమవుతాయి. రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి.
ఎలా ఉపయోగించాలంటే
హిందూ మతంలో అక్షతలు లేని పూజ లేదా పారాయణం పూర్తి కాదని నమ్ముతారు. రామ మందిరం నుంచి తెచ్చిన అక్షతలను ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శ్రీరాముడి దయ ఉంటుందని విశ్వాసం. అంతేకాదు డబ్బులు పెట్టుకునే ప్లేస్ లో ఉంచడం సంపద పెరుగుతుందని విశ్వాసం. ఇంట్లో ఆనందం, శాంతి, ఐశ్వర్యం ఉంటాయి.
కొత్త పెళ్లికూతురు ఎలా ఉపయోగించాలంటే
నవ వధువు మొదటి సరిగా అత్తవారింట్లో వంటగదిలో రామాలయం నుండి తెచ్చిన ఈ అక్షతలను ఉపయోగించవచ్చు. అన్నపూర్ణ తల్లి వంట ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. అత్తమామలతో సంబంధాలు బలపడతాయి. రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి.
కుమార్తె పెళ్లిలో అక్షతలు
ఇంట్లో కూతురి పెళ్లి జరిగితే రామ మందిరం నుంచి వచ్చిన అక్షతలను తలంబ్రాల బియ్యంలో కలపండి. ఇలా చేయడం వలన పుట్టింట్లో, అత్తింట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు