AC Robbery: ఇదెక్కడి దొంగతనంరా సామీ.. ఏటీఎంలో ఏసీ దొంగతనం చేసిన దుండగులు
సాధారణంగా దొంగతనాలు ఇళ్లల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో జరుగుతుంటాయి. కానీ ఈ మధ్య మాత్రం దొంగలు ఏటీఎం మిషన్‌లను కూడా వదలడం లేదు. డబ్బుల కోసం ఏకంగా ఏటీఎం మిషన్లను పగలకొట్టి డబ్బలు దోచుకెళ్లడం.. అది కుదరకపోతే ఏకంగా మిషన్‌నే ఎత్తుకెళుతున్న పరిస్థితి నెలకొంది.

సాధారణంగా దొంగతనాలు ఇళ్లల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో జరుగుతుంటాయి. కానీ ఈ మధ్య మాత్రం దొంగలు ఏటీఎం మిషన్‌లను కూడా వదలడం లేదు. డబ్బుల కోసం ఏకంగా ఏటీఎం మిషన్లను పగలకొట్టి డబ్బలు దోచుకెళ్లడం.. అది కుదరకపోతే ఏకంగా మిషన్‌నే ఎత్తుకెళుతున్న పరిస్థితి నెలకొంది. నిందితులు సీసీ కెమెరాలకు చిక్కి పోలీసులు జైల్లో వేస్తున్న కూడా చాలాచోట్ల ఈ ఏటీఎం దొంగతనాలు ఆగడం లేదు. ఇటీవలే మహారాష్ట్రలోని తాళం తెరుచుకోలేదని.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారు. ఇప్పుడు తాజాగా అంతకు మించిన ఘటన చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని మోగా జిల్లా బాఘ్ పట్టణంలో ఏటీఎం యంత్రాన్ని, డబ్బులు వదిలేసి ఏకంగా ఏసీని ఎత్తుకెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంలోకి వచ్చారు. అందులో ఒకడు.. పక్కనే ఉన్న చెత్తబుట్టిని తిరగేసి దానిపైకి ఎక్కేశాడు. ఆ తర్వాత ఇండోర్ ఏసీ యూనిట్ వైర్లను కత్తిరించాడు. చివరికి వాళ్లిద్దరు ఏసీని ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.