Viral Video: కలియుగ అర్జునుడు.. కళ్లకు గంతలు కట్టుకొని మరీ.. ఒకే ఒక్క షాట్‌తో..
ప్రపంచంలో అరుదైన ట్యాలెంట్ కలిగిన వ్యక్తులు ఎందరోఉన్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడెక్కడో ఉన్న వీరంతా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి తన అరుదైన ట్యాలెంట్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మహాభారతంలో అర్జునుడు కింద నీటిలో చూసి పైన చేపను బాణంతో కొట్టడం.
ప్రపంచంలో అరుదైన ట్యాలెంట్ కలిగిన వ్యక్తులు ఎందరోఉన్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడెక్కడో ఉన్న వీరంతా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి తన అరుదైన ట్యాలెంట్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మహాభారతంలో అర్జునుడు కింద నీటిలో చూసి పైన చేపను బాణంతో కొట్టడం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇతను కూడా అలాంటి ప్రయోగమే చేశాడు. అయితే ఇతను చేపను కొట్టలేదు.. ప్లాస్టిక్ బాటిల్‌ని ఒకే ఒక్కషాట్‌తో తునాతునకలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతని ట్యాలెంట్‌కు నెటిజన్లు అవాక్కవుతున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకొని ఉన్నాడు. అతనికి కొంచెం దూరంలో ఓ సైకిలు రివర్స్‌లో పెట్టి ఉంది. దాని చక్రానికి ఓ ప్లాస్టిక్ బాటిల్ కట్టి ఉంది. దాన్ని ఇతను లక్ష్యంగా చేసుకొని స్లింగ్‌షాట్‌తో కొట్టాడు. అది కూడా సైకిల్ చక్రం తిరుగుతూ ఉండగా ఒకే ఒక్క షాట్‌తో లక్ష్యాన్ని ఛేదించాడు. కళ్లు తెరిచి కూడా అలా తిరుగుతున్న చక్రానికున్న లక్ష్యాన్ని చేధించడం అంత సులభం కాదు. అద్భుతమైన ఆ వ్యక్తి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 18 మిలియన్ల మంది వీక్షించారు. బ్రదర్.. నీట్యాలెంట్ సూపర్.. ఒలింపిక్స్ వెళితే గోల్డ్‌మెడల్ ఖాయం అంటున్నారు. ‘ఈ సోదరుడు కలియుగ అర్జున్’ అంటూ మరొకరు రాశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...