Viral Video: మాటువేసి సైకిల్ ఎత్తుకెళ్లాడు.. చివరికి ఓనర్ చేసిన పనికి షాకయ్యాడు.. వీడియో వైరల్..
దొంగతం చేయాలంటే ఎన్నో ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది. దొంగతనం చేయడం అంత సులువైన పని కాదు.. అది కూడా

దొంగతం చేయాలంటే ఎన్నో ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది. దొంగతనం చేయడం అంత సులువైన పని కాదు.. అది కూడా ఒక కళే. ఎన్నో ప్రణాళికలు వేసి.. ఎంతో వ్యూహత్మాకంగా మాటు వేసి దొంగతనం చేసిన కొన్నిసార్లు బెడిసి కొడుతుంది. అలాగే దొంగతనం చేయడానికి వెళ్లి అడ్డంగా దొరికి ఒళ్లు హూనం చేసుకున్న వాళ్లు కూడా ఉంటారు. అయితే జనాలకు తెలియకుండా ఎంతో చాకచక్యంగా దొంగతనం చేసిన సీసీ ఫుటేజ్ నుంచి తప్పించుకోలేరు. ఇటీవల దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోవడం… లేదా.. ఎంతో తెలివిగా దొంగతనం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ అతి తెలివి దొంగ పట్ట పగలే ఇంట్లో నుంచి సైకిల్ దొంగిలించాడు.. కానీ ఆ తర్వాత ఓనర్ చేసిన పనికి షాకయ్యాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ వీడియో.. ఓ ఇంటి గేట్ ఓపెన్ చేసి ఉండడంతో ఎంతో దర్జాగా లోపలికి వెళ్లాడు ఓ దొంగ. కాసేపు అక్కడే ఉండి.. ఇంట్లో వాళ్లను గమనించాడు. ఇక ఆ ఇంటి వారండాలో బైక్, సైకిల్ పార్క్ చేసి ఉన్నాయి. కాసేపు అక్కడే ఉన్న దొంగ ఆ తర్వాత సైకిల్‌ను ఎంతో నిదానంగా.. దర్జాగా తీసుకుని వెళ్లిపోయాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన ఆ ఇంటి ఓనర్ దొంగ వెనకాల పరిగెత్తాడు. ఓనర్ రావడం చూసిన ఆ దొంగ పరిగెత్తగా.. చివరకు ఓనర్ చేతికి చిక్కాడు. ఆ దొంగను పట్టుకుని ఓనర్.. తన సైకిల్ తాను ఇంటికి తీసుకువచ్చాడు. ఈ ఘటన మొత్తం ఆ ఇంటి వారండాలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను మీమ్స్ మార్చేసి నెట్టింట్లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. అతి తెలివి దొంగ.. మొదటి సారి దొంగతనం చేస్తున్నాడమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.
View this post on Instagram
Also Read: Jai Bhim: జైభీమ్ సినిమా వివాదంపై స్పందించిన డైరెక్టర్.. కావాలని సూర్యను టార్గెట్ చేస్తున్నారంటూ..
Gamanam: ప్రేక్షకుల ముందుకు గమనం.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రయూనిట్..
Kaikala Satyanarayana: విషమంగానే కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల