Video Viral: చూట్టూ బంధువులు, జనాలు.. వేదికపై నూతన వధూవరులు చేసిన పనికి అందరూ షాక్
పెళ్లి (Wedding) అనేది ప్రతి అబ్బాయి, అమ్మాయి జీవితంలో మరిచిపోలేని ఓ అపురూప వేడుక. ఈ రోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లతో పాటు ప్రేమ వివాహాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి. ప్రేమలో పడిన యువతీయువకులు వారి విషయాన్ని...
పెళ్లి (Wedding) అనేది ప్రతి అబ్బాయి, అమ్మాయి జీవితంలో మరిచిపోలేని ఓ అపురూప వేడుక. ఈ రోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లతో పాటు ప్రేమ వివాహాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి. ప్రేమలో పడిన యువతీయువకులు వారి విషయాన్ని పెద్దలకు చెబుతున్నారు. వారు కూడా పిల్లల ఇష్టాన్ని కాదనలేకపోతున్నారు. ముందు వెనకూ ఆలోచించి, కుటుంబ పెద్దలతో మాట్లాడి పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇలాంటి వివాహ కార్యక్రమాలకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతుంటాయి. ఇందులో వధూవరుల మధ్య జరిగే ఫన్నీ కన్వర్జేషన్, విచిత్రమైన పనులు, వెరైటీ కార్యక్రమాలు ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నూతన వధూవరులు పెళ్లి మండపంలో కూర్చుని ఉంటారు. వారి చుట్టూ బంధుమిత్రులతో కోలాహలంగా ఉంటుంది. ఈ సమయంలో వధువు వరుడి వైపు ఓరగా చూస్తుంది. వెంటనే వరుడు కూడా ఆమె వైపు చూసి కొంటెగా నవ్వుతాడు. ఇలా కొంత సమయం చూసిన తర్వాత వధువు కూడా నవ్వేస్తుంది. అయితే వీరి ప్రేమ చూపులను అక్కడ ఉన్న వారు ఎవరూ చూడలేదు. ఒకవేళ చూసి ఉంటే వారి పరిస్థితి మరింత ఫన్నీగా ఉండేది. ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఒకరు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. క్షణంలో వీడియో వైరల్ అయింది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ ను ఇప్పటివరకు 18 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. చాలా మంది లైక్ చేస్తున్నారు. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వధూవరుల మధ్య మంచి అనుబంధం ఉందని, వారి చూపులు భవిష్యత్ ను తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్నిట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి