AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: వారెవ్వా.. ఏం టాలెంట్ గురూ.. వెయిటర్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..

హోటల్, రెస్టారెంట్లలో పని చేసే సిబ్బందికి క్షణం కూడా తీరిక ఉండదు. పనిలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి చేసేంత వరకు చెమటోడుస్తూనే ఉంటారు. కస్టమర్ల ఆర్డర్లు తీసుకోవడం, వారికి ఫుడ్ అందించడం, టేబుల్ క్లీన్..

Trending Video: వారెవ్వా.. ఏం టాలెంట్ గురూ.. వెయిటర్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..
Waiter Talent
Ganesh Mudavath
|

Updated on: Feb 01, 2023 | 5:43 PM

Share

హోటల్, రెస్టారెంట్లలో పని చేసే సిబ్బందికి క్షణం కూడా తీరిక ఉండదు. పనిలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి చేసేంత వరకు చెమటోడుస్తూనే ఉంటారు. కస్టమర్ల ఆర్డర్లు తీసుకోవడం, వారికి ఫుడ్ అందించడం, టేబుల్ క్లీన్ చేయడం.. ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో రకాల పనులు చేయాల్సి ఉంటుంది. రోజంతా అటూ ఇటూ తిరుగుతూ కస్టమర్లకు సేవలు అందిస్తుంటారు. రోజంతా విశ్రాంతి లేకుండా పనులు చేయడం వల్ల వారు అనారోగ్యానికి గురవుతుంటారు. కానీ కొందరు మాత్రం చాలా ఉత్సాహంగా పని చేస్తుంటారు. కష్టమైన పనిని కూడా క్షణాల్లో పూర్తి చేస్తుంటారు. కొత్త కొత్త టెక్నిక్స్ తెలుసుకుంటూ పనిని చిటికెలో పూర్తి చేసేస్తుంటారు. కూరగాయలు కట్ చేయడం, ఫుడ్ సర్వీస్ చేయడం వంటి పనుల్లో వైరుధ్యాన్ని చూపిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియాలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం కూడా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ సర్వర్ దోసెలను వెరైటీగా తీసుకెళ్లడాన్ని చూడవచ్చు. రద్దీ గా ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద రుచికరమైన దోసెలు తినేందుకు చాలా మంది భోజన ప్రియులు వచ్చారు. దీంతో దోసెలు వేసే మాస్టర్.. క్షణం కూడా తీరిక లేకుండా చకచకా దోసెలు వేసేశాడు. మరి.. అన్ని దోసెలను తీసుకెళ్లి కస్టమర్లకు ఇవ్వాలంటే చాలా పెద్ద పని. దీనికి ప్రత్యామ్నాయంగా ఓ వెయిటర్ ఆలోచించాడు. ఒక ప్లేట్ పై మరో ప్లేట్.. ఇలా భుజం వరకు పెట్టుకున్నాడు. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కస్టమర్లకు అందించాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది. వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..