Wedding Card: వాటే క్రియేటివిటీ.. ఇలాంటి పెళ్లి కార్డు మీరెప్పుడైనా చూశారా..? వైరల్ అవుతున్న వెరైటీ శుభలేఖ.
ఇంటర్‌నెట్ వినియోగం విచ్చలవిడిగా మారిపోయింది. సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రమైన పోస్ట్‌లు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అదే తరహాలో ఒక వెడ్డింగ్ కార్డు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఏడిద వెంకటేష్.. తన చిన్న కుమార్తె పెళ్లికి రెండు వేల రూపాయల నోటు తరహాలో శుభలేఖ అచ్చు వేయించారు. చిన్న పరిమాణంలోనే.. 2 వేల రూపాయల నోటును పోలినట్లుగా తయారు చేయించిన ఈ పెళ్లి కార్డు అందరినీ ఆకట్టుకుంటోంది..కరెన్సీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అక్షరాలుండే చోట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్ అనే పదం చేర్చారు. వివాహ బంధంతో ఒక్కటవుతున్నాం.. చివరి శ్వాసవరకూ కలసి ఉంటామంటూ కార్డుపై ప్రస్తావించారు. అలాగే నోటుకు మరోవైపు వివాహానికి సంబంధించి వివరాలు ముద్రించారు. ఈ వెరైటీ శుభలేఖల్ని బంధువులు, స్నేహితులకు అందిస్తుంటే.. నిజంగా రెండు వేల నోటు అనుకుని తీసుకునేందుకు మొహమాటపడ్డారు. ఆ తర్వాత 2వేల నోటును పోలి ఉన్న శుభలేఖ అని తెలుసుకుని.. వాళ్ల క్రియేటివీటీకి ఫిదా అయ్యారు. అంతేకాదు 2017లో వెంకటేష్ తన పెద్ద కుమార్తె పెళ్లికి బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో శుభలేఖను తయారు చేయించారు. వెంకటేష్ క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వధూవరులకు ప్రశంసల శుభాకాంక్షలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

