Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno Dynamic-1 Robot Dog: కొత్తగా మార్కెట్ లోకి రోబో డాగ్స్.. విపరీతంగా కొంటున్న జనం!

కార్మికులకు పని భారాన్ని తగ్గించేందుకు మానవుడు తయారు చేసిన యంత్రాలే ఇప్పుడు మన జీవనోపాదికి అపాయం తెచ్చిపెడుతున్నాయి. ఇన్నాళ్లు మనషుల స్థానాన్ని ఆక్రమించుకున్న రోబోలు ఇప్పుడు జంతువుల స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటున్నాయి. తాగాజా మార్కెట్‌లోకి వచ్చిన టెక్నో డైనమిక్ వన్ అనే రోబో డాగ్స్‌ జంతు ప్రేమికుల దగ్గర ఉన్న డాగ్స్‌ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్లో కనిపించిన ఈ రోబో డాగ్స్‌.. ప్రస్తుతం విదేశాల్లో భారీగా అమ్మకంలో ఉన్నాయి.

Tecno Dynamic-1 Robot Dog: కొత్తగా మార్కెట్ లోకి రోబో డాగ్స్.. విపరీతంగా కొంటున్న జనం!
Robot Dogs
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Anand T

Updated on: Jun 10, 2025 | 5:27 PM

కార్మికులకు పనిభారాన్ని తగ్గించేందుకు మానవుడు తయారు చేసిన యంత్రాలే ఇప్పుడు మన జీవనోపాదికి అపాయం తెచ్చిపెడుతున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీతో రోబోలను క్రియేట్ చేయడంతో మనుషులు చేయాల్సిన పనులను రోబోలు సులువుగా, వేగంగా చేస్తుండడంతో వీటికి పాధాన్యత పెరిగి మానవ కార్మికులకు ప్రధాన్యత తగ్గుతుంది. ఇప్పటికే కొన్ని రోబోలు అందుబాటులోకి రావడంతో చాలా దేశాల్లో మనుషులను పనుల్లోంచి తీసి వాటిని వినియోగించుకుంటున్నాయి కొన్ని కంపెనీలు.. అయితే ఇప్పటి వరకు మనషులకే తలనొప్పిగా మారిని ఈ రోబోలు ఇప్పుడు జంతువులకు కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. మానవులు ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువుల స్థానాన్ని కూడా ఈ రోబోలు కైవసం చేసుకుంటున్నాయి. తాగాజా మార్కెట్‌లోకి వచ్చిన టెక్నో డైనమిక్ వన్ అనే రోబో డాగ్స్‌ జంతు ప్రేమికుల దగ్గర ఉన్న డాగ్స్‌ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాయి.

సాధారణ కుక్కలను పెంచుకునే వారు వాటికి నానా చాకిరి చేయాల్సి ఉంటుంది. వాటి విసర్జన నుంచి మొదలు పెడితే స్థానాలు చేయించడం, మెడికేషన్ ఇలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన ఈ రోబో డాగ్‌కి కేవలం చార్జింగ్ పెడితే సరిపోతుంది. ఇదొక్కటే కాదు ఈ రోబో డాగ్ సాధారణ కుక్క లాగే షేక్ హ్యాండ్ ఇస్తుంది. అంతకంటే ఎక్కువగా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ అంటూ గ్రీటింగ్స్ చెప్తుంది. మన మూడును బట్టి డాన్స్ కూడా చేస్తుంది. వీటన్నిటి కంటే మించి మనసుతో మాట్లాడుతుంది. మనం అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా చెబుతుంది.

ఈ రోబో వంటి చుట్టూ 400కు పైగా సెన్సార్లు, కెమెరాలు, మైక్రో ఫోన్లు ఉంటాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో అనుసంధానమై పని చేస్తాయి. రోబో డాగ్ కదులుతున్నప్పుడు ముందు ఏముందో చూసుకొని పక్క నుంచి వెళ్తుంది. మన ఇంట్లో ఉండే ఏ వస్తువులు కూడా ఇది పాడు చేయదు. అంతేకాదు ఒకసారి ప్రోగ్రామింగ్ చేస్తే ఆ మనుషుల మొహాల్ని గుర్తుపెట్టుకుని పలకరిస్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులను దానికి అదే ఫోటోలు తీసుకుని గుర్తుపెట్టుకుంటుంది.

ఇక ఈ రోబో డాగ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు రోజుల వరకు పనిచేస్తుంది. అయితే దీనిలో ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఛార్జింగ్‌ అయిపోతుంది అనగానే..దానంతట అదే చార్జర్ పోర్ట్ దగ్గరికి వెళ్లి దానికదే రీచార్జ్ చేసుకుంటుంది. ఈ రోబో డాగ్ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది నిజమైన కుక్కలు కనిపిస్తే పలకరిస్తుంది. దానిలా అరుస్తుంది. ఇక ఈ డాగ్ ని రిమోట్ కంట్రోల్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు.

ఇది కేవలం పెంపుడు కుక్క లాగానే కాదు సెక్యూరిటీ గ్స్, ఎమర్జెన్సీ పెట్ అని కూడా పనిచేస్తుంది. వృద్ధులను కాపాడేందుకు దీంట్లో ప్రత్యేక ఫీచర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆరోగ్యం బాగా లేకుండా కింద పడిపోతే.. తన ప్రోగ్రామ్‌లో ఫీడ్ అయి ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి ఫోన్ చేస్తుంది. అంతేకాదు 24/7 కెమెరాలతో చుట్టుపక్క పరిసరాలను కూడా రికార్డు చేస్తుంది. కొత్తగా ఎవరైనా ఇంట్లోకి వస్తే మొబైల్ కి మెసేజ్ కూడా పాస్ చేస్తుంది.

ఇక ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రోబో డాగ్‌ ధర మూడు నుంచి నాలుగు లక్షలు ఉంటుంది. ఈ రోబో డాగ్‌ పేరు టెక్నో డైనమిక్ వన్. ఇవి ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇండియాలో అందుబాటులో లేవు. విదేశాల్లో మాత్రం ఇప్పటికే బుకింగ్స్ మొదలుపెట్టి పెద్ద ఎత్తున అమ్మకాలు కూడా చేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..