Viral Video: ముంబై బేకరీల్లో ఫుడ్‌ను తనిఖీ చేస్తున్న బొద్దింకలు… సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్స్
పైకి అందంగా ప్యాకేజ్ చేయబడిన ఆహార పదార్థాలు ఎంత అపరిశుభ్రంగా ఉంటాయో ఈ సంఘటన రూఢీ పరుస్తోంది. ఇక బేకరీలు, హోటళ్లలో కొనే ఆహార పదార్థాలు ఒకటికి రెండు సార్లు పరిశీలించి కొనాల్సిన పరిస్థితి. ఇలాంటి సంఘటనే ముంబయిలో జరిగింది. ములుండ్ వెస్ట్‌లో రన్‌వాల్ గ్రీన్స్‌లోని థియోబ్రోమా సందర్శించినప్పుడు...

పైకి అందంగా ప్యాకేజ్ చేయబడిన ఆహార పదార్థాలు ఎంత అపరిశుభ్రంగా ఉంటాయో ఈ సంఘటన రూఢీ పరుస్తోంది. ఇక బేకరీలు, హోటళ్లలో కొనే ఆహార పదార్థాలు ఒకటికి రెండు సార్లు పరిశీలించి కొనాల్సిన పరిస్థితి. ఇలాంటి సంఘటనే ముంబయిలో జరిగింది. ములుండ్ వెస్ట్‌లో రన్‌వాల్ గ్రీన్స్‌లోని థియోబ్రోమా సందర్శించినప్పుడు, స్పైసీ మిరపకాయ పనీర్ గదిలో బొద్దింక తిరుగుతున్నట్లు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా ప్రచారం చేయబడింది. చిల్లీ పనీర్ రోడ్‌లోని గ్లాస్ కబోర్డులో అందంగా అమర్చిన తినుబండారాల్లో బొద్దింక ఉన్నట్లు వీడియో చూపిస్తుంది.
ఈ వీడియోను ఒక సోషల్ మీడియా యూజర్ “థియోబ్రోమా స్పైసీ పనీర్ రోల్, రన్‌వాల్ గ్రీన్స్, ములుండ్ వెస్ట్, ముంబై” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. సోషల్ మీడియా యూజర్లు కూడా బొద్దింకను చూసి షాక్ అయ్యారు. “మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మనం నాణ్యతను పాటించడంలో ఫెయిల్ అవుతున్నామని సోషల్ మీడియా యూజర్స్ పోస్టు చేస్తున్నారు.
వీడియో చూడండి:
This is what we saw in Theobroma: Runwal Greens, Mulund West, Mumbai byu/Familiar-Guava-3123 inindiasocial
“అది ఫుడ్ ఇన్స్పెక్టర్ హోదాలు నాణ్యత తనిఖీలు చేస్తున్నది” అని మరికరు కామెంట్స్ చేశారు. అయితే చాలా మంది వినియోగదారులు తమను ఇది కలవరపెట్టేదిగా ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు.