Swiggy: స్విగ్గీలో వెల్లువెత్తిన కండోమ్‌ ఆర్డర్‌లు.. ఏడాది చివరి రోజున రికార్డు స్థాయి డెలివరీలు..

ఒకప్పుడు ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ అంటే వస్తువులు లేదా రెస్టారెంట్‌లో ఫుడ్‌.. కానీ ఇప్పుడు కాదేది ఆన్‌లైన్‌ ఆర్డ్స్‌కు అనర్హం అన్నట్లు మారిపోయింది. వంట సామాను మొదలు చిన్న పెన్ను వరకు ప్రతీ ఒక్క ప్రొడక్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌..

Swiggy: స్విగ్గీలో వెల్లువెత్తిన కండోమ్‌ ఆర్డర్‌లు.. ఏడాది చివరి రోజున రికార్డు స్థాయి డెలివరీలు..
Swiggy Instamart
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 02, 2023 | 8:54 PM

ఒకప్పుడు ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ అంటే వస్తువులు లేదా రెస్టారెంట్‌లో ఫుడ్‌.. కానీ ఇప్పుడు కాదేది ఆన్‌లైన్‌ ఆర్డ్స్‌కు అనర్హం అన్నట్లు మారిపోయింది. వంట సామాను మొదలు చిన్న పెన్ను వరకు ప్రతీ ఒక్క ప్రొడక్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు సైతం ఇందుకు అనుగుణంగా ఆఫర్లను అందిస్తున్నాయి. మినినం ఆర్డర్‌ అనేది లేకుండా ఒక్క వస్తువును బుక్‌ చేసుకున్నా ఆర్డర్స్‌ని తీసుకుంటున్నారు. చివరికి కండోమ్స్‌ని కూడా ఆన్‌లైన్‌లో అందించే రోజులు వచ్చేశాయ్‌.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఇన్‌స్టాంట్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. 2022 డిసెంబర్‌ 31వ తేదీన తమ యాప్‌లో వచ్చిన ఆర్డర్‌కి సంబంధించిన విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది. ఏడాది చివరి రోజు రాత్రి 9.30 గంటల సమయానికి 2757 ప్యాకెట్ల కండోమ్‌లను యూజర్లు ఆర్డర్‌ చేసినట్లు తెలిపింది. అంతేకాదండోయ్‌ ఆ రోజు తమ సంస్థ కండోమ్‌ను అత్యంత వేగంగా డెలివరి చేసినట్లు పేర్కొంది. కేవలం 2.5 నిమిషాల్లోనే తమ యూజర్‌కు కండోమ్‌ ప్యాకెట్‌ను డెలివరి చేసినట్లు తెలిపింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే డిసెంబర్‌ 31 రాత్రి 7 గంటల సమయానికి ఇన్‌స్టామార్ట్‌లో ఏకంగా 1.76 లక్షల చిప్స్‌ ప్యాకెట్లను ఆర్డర్‌ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. వీటితో పాటు హైదరాబాద్‌ బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా రాత్రి 10.25 గంటల సమయానికి 61,000 పిజ్జాలను డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..