AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ హంస చేస్తోన్న పనిని చూసి మనుషులు సిగ్గు పడాల్సిందే.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు!

'ప్లాస్టిక్'.. మన రోజూ వారి దినచర్యలో ఇదొక భాగమైపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ..

Viral Video: ఈ హంస చేస్తోన్న పనిని చూసి మనుషులు సిగ్గు పడాల్సిందే.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు!
Viral
Ravi Kiran
|

Updated on: Jan 16, 2022 | 4:07 PM

Share

‘ప్లాస్టిక్’.. మన రోజూ వారి దినచర్యలో ఇదొక భాగమైపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ.. దాని వాడకం మాత్రం తగ్గట్లేదు. ప్లాస్టిక్ వ్యర్ధాలు కారణంగా పర్యావరణం కలుషితం అయిపోవడమే కాదు.. అది మూగజీవాల ప్రాణాలకు సైతం ఓ శాపంగా మారింది. ఎన్నో జంతువులు ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలను తిని ప్రాణాలు కోల్పోతున్నాయి.

కొంతమంది ప్లాస్టిక్ వ్యర్ధాలను సరస్సుల్లోనూ, నదుల్లోనూ పారేస్తుంటారు. దాని వల్ల నీరు కలుషితం కావడమే కాదు.. జలచరాలు కూడా చనిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో హంస చేస్తోన్న పనిని చూస్తే మీరు ఖచ్చితంగా వావ్ అనకుండా ఉండలేరు.

Also Read: రైలు పట్టాలపై కుప్పలుగా అమెజాన్ డెలివరీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్.!

వైరల్ అవుతున్న వీడియోలో, ఓ హంస నీటిలో నుంచి ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగిస్తుంది. దానిని మీరు వీడియోలో చూడవచ్చు. తన పిల్లలకు వాటి వల్ల ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ఆ హంస చేస్తోన్న పనిని నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ షాకింగ్ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘తన పిల్లల కోసం నీటి నుంచి హంస ప్లాస్టిక్ తొలగిస్తోంది. మరి మనకెప్పుడు అర్ధమవుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ఇప్పటిదాకా ఈ వీడియో 98 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 2 వేలకు పైగా రీ ట్వీట్స్, 7.3 వేలకుపైగా లైక్స్ తెచ్చుకుంది. ‘మనం చేసే తప్పుల.. ఎదుటవారికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి’ అనడానికి ఇదే ఉదాహరణ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘జంతువులను చూసి మనుషులు నేర్చుకోవాలి’ అని మరొకరు కామెంట్ చేశారు.

Also Read: ఖతర్నాక్ దొంగ.. స్కెచ్ మాములుగా లేదుగా.. ఫోన్ ఎలా కొట్టేశాడో చూస్తే ఫ్యూజులు ఔట్!