Viral Video: ఖతర్నాక్ దొంగ.. స్కెచ్ మాములుగా లేదుగా.. ఫోన్ ఎలా కొట్టేశాడో చూస్తే ఫ్యూజులు ఔట్!

వీడొక ఖతర్నాక్ దొంగ. చోరీల్లో వీడి స్టైల్ సెపరేట్. ముందుగా చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నింటినీ గమనించి.. సరైన టైంలో స్కెచ్ వేసి చోరీ చేస్తాడు...

Viral Video: ఖతర్నాక్ దొంగ.. స్కెచ్ మాములుగా లేదుగా.. ఫోన్ ఎలా కొట్టేశాడో చూస్తే ఫ్యూజులు ఔట్!
Thief
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 15, 2022 | 4:13 PM

వీడొక ఖతర్నాక్ దొంగ. చోరీల్లో వీడి స్టైల్ సెపరేట్. ముందుగా చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నింటినీ గమనించి.. సరైన టైంలో స్కెచ్ వేసి చోరీ చేస్తాడు. ఏంటి ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.! తాజాగా నెట్టింట ఓ వ్యక్తి దొంగతనం చేసిన వీడియో వైరల్‌గా మారింది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా అస్సలు ఈ సీన్ ఊహించలేదని అంటారు. లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.

వైరల్ అవుతున్న వీడియో ఓ రైల్వే స్టేషన్‌కి సంబంధించినది. స్టేషన్‌లో ఓ రైలు ఆగి ఉన్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఇక ఆ రైలు డోర్ దగ్గర ఓ వ్యక్తి నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. రైల్వే స్టేషన్‌లో రద్దీ లేకపోయినా.. ఆ వ్యక్తి దగ్గరలో మాత్రం చాలామంది ఉన్నారు. ఇక ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న ఓ వ్యక్తి.. అప్పుడే ట్రైన్‌లోకి ఎక్కుతాడు. ట్రైన్ స్టార్ట్ అయింది. ఇంతవరకు బాగానే ఉంది కదా. అయితే కథలో అసలైన ట్విస్ట్ ఇప్పుడు వస్తుంది. కర్చీఫ్ కట్టుకున్న వ్యక్తి అప్పుడే రన్నింగ్ ట్రైన్ నుంచి దిగుతాడు. వెనక్కి నడుచుకుంటూ వచ్చి అమాంతం డోర్ దగ్గర నిలబడిన వ్యక్తి చేతుల్లో నుంచి మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోతాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, ఈ వీడియోను ‘haq_se_engineers’ అనే ఇన్‌స్టా పేజీ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు 69 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘ఈ సీన్ అస్సలు ఊహించలేదు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం అంటే ఇదేనేమో’ అంటూ మరొకరు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read: 

Viral Photo: ఈ ఫోటోలో చిరుతను దాగుంది.. కనిపెడితే మీ కళ్లలో పదునున్నట్లే.!

Telangana: కరోనా ఆంక్షలు.. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు.?