Viral: ‘ఇలా ఉంటే ప్రపంచాన్ని ఏలేయవచ్చు’.. ఎగ్జామ్‌లో చిచ్చరపిడుగు కిర్రాక్ ఆన్సర్

ఇప్పుడు దూసుకుపోవాలంటే దిమాక్ యాక్టివ్‌గా ఉండాలి. ఏమాత్రం స్లోగా ఉన్నా వెనకబడిపోతాం. కావాలంటే ఈ చిచ్చరపిడుగును చూసి మీరు ఇన్‌స్పైర్ అవ్వండి.

Viral: 'ఇలా ఉంటే ప్రపంచాన్ని ఏలేయవచ్చు'.. ఎగ్జామ్‌లో చిచ్చరపిడుగు కిర్రాక్ ఆన్సర్
Kid Crazy Test Answer
Follow us

|

Updated on: Aug 18, 2022 | 9:18 AM

Trending: ప్రజంట్ జనరేషన్‌లో హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ చేయాలి.. ఇంకా చెప్పాలంటే ఇస్మార్ట్‌‌గా థింక్ చేయాలి… ఇది చాలామంది చెబుతున్న మాట. మాస్టారు చెప్పిన లెస్సన్ బట్టి పట్టడం హార్డ్ వర్క్. దాన్ని ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడం స్మార్ట్ వర్క్. అలా చేస్తే మళ్లీ ఆ లెసన్ మర్చిపోయే అవకాశమే ఉండదు. ఇది పోటీ ప్రపంచం. బుర్రకు పదునుపెట్టకపోతే.. నెగ్గడం కష్టం. తాజాగా బుద్దిబలం ఉన్న ఓ స్టూడెంట్ ఎగ్జామ్‌లో రాసిన క్రేజీ ఆన్సర్ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. ప్రశ్నను చూస్తే అది 2, 3 తరగతుల్లో అడిగే ప్రశ్న మాదిరిగానే కనబడుతుంది. ఆ వయసులో అదిరే ఆన్సర్ రాసి అటు టీచర్‌ కాంప్లిమెంట్స్‌తో పాటు ఇటు నెటిజన్ల అప్లాజ్ అందుకున్నాడు ఆ చిచ్చరపిడుగు. ‘ఇదిగో.. ఇలా ఉంటే ప్రపంచాన్ని ఏలేయవచ్చు’ అని కామెంట్స్ పెడుతున్నారు చాలామంది. Write Five Words You Can Spell అన్నది ప్రశ్న. దీనికి సహజంగా అయితే అందరూ తమకు తెలిసిన ఇంగ్లీషు పదాలు గుర్తు తెచ్చుకుని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఆన్సర్ రాసేందుకు చాలా కష్టపడతారు. కాగా ఈ చురుకైన విద్యార్థి మాత్రం.. ఇచ్చిన ప్రశ్నలోని పదాలను(Five, Words, You, Can, Spell) ఆన్సర్‌గా రాసేశాడు. అక్కడ తెలివితేటలే కాదు అతడి సమయస్పూర్తి కూడా అదుర్స్ కదా. అతడి ఆన్సర్ చూసి.. టీచర్ మెస్మరైజ్ అయ్యింది. వెరీ క్లవర్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. అది 5 మార్కుల ప్రశ్న కాగా.. మరో 2 మార్కులు బోనస్‌గా ఇచ్చింది. అది చదువు అయినా, జాబ్ అయినా, బిజినెస్ అయినా.. బోనస్ కొట్టాలంటే కాస్త ఇస్మార్ట్‌గా ఆలోచించాలని ఈ చిన్నోడు చిన్నవయసులోనే చెప్పేస్తున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..