Viral News: ఒక్క యూటర్న్ కూడా లేకుండా 14 దేశాలను కలిపే ఏకైక హైవే.. ఎక్కడుందో తెలుసా?
ప్రపంచంలోని అత్యంత పొడవైన హైవే ఏదంటే టక్కున చెప్పేస్తారు. కానీ యూటర్న్ లేని పొడవైన హైవే ఏదో మీకు తెలుసా? లేదు కదా.. ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి పాన్-అమెరికన్ హైవే, ఇది 30,000 కి.మీ పొడవు ఉంటుంది. ఇది అలాస్కా నుండి అర్జెంటీనా వరకు 14 దేశాలను కలుపుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమటింటే ఈ రహదారిపై ఒక్క యు-టర్న్ కూడా ఉండదు.

ప్రపంచంలోని అత్యంత పొడవైన హైవే ఏదంటే టక్కున చెప్పేస్తారు. కానీ యూటర్న్ లేని పొడవైన హైవే ఏదో మీకు తెలుసా? లేదు కదా.. ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి పాన్-అమెరికన్ హైవే,ఈ హైవేకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.ఈ హైవే 14 దేశాల గుండా వెళుతుంది.ఇది 30,000 కిలోమీటర్లు (సుమారు 19,000 మైళ్ళు) పొడవు ఉంటుంది. 30,000 కి.మీ పొడవైన పాన్-అమెరికన్ హైవే ఉత్తర కొనలో ఉన్న అలాస్కాలోని ప్రుధో బే వద్ద ప్రారంభమై దక్షిణ అమెరికా దక్షిణ కొనలోని అర్జెంటీనాలోని ఉషుయా వద్ద ముగుస్తుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 1920లలో నిర్మించబడిన ఈ హైవే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోడ్డు ప్రయాణికులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. దీని నిర్వహణను 14 దేశాలు పంచుకుంటాయి.
ప్రపంచంలోనే యూటర్న్ లేని పొడవైన హైవే
ఈ పాన్-అమెరికన్ హైవేపై స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎటువంటి యు-టర్న్లు లేదా వంపు కూడా కనిపించదు. ఈ రహదారి దాదాపు 30,600 కిలోమీటర్లు (19,000 మైళ్ళు) పొడవు ఉండి, అందుకే ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రహదారిగా పిలువబడుతుంది.ఈ పాన్-అమెరికన్ హైవే ఒక చివర నుండి మరొక చివర వరకు ప్రయాణించడానికి దాదాపు 60 రోజులు అంటే 2 నెలల సమయం పడుతుంది.
ఈ హైవే ఏ దేశాలను కలుపుతుంది?
పాన్-అమెరికన్ హైవే సుమారు 14 దేశాల గుండా వెళుతుంది. కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరాగ్వా, కోస్టా రికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, అర్జెంటీనాలను కలుపుతుంది. అందుకే ఈ హైవే నిర్వహణ బాధ్యతను కూడా 14 దేశాలు పంచుకుంటాయి.
దాన్ని ఎప్పుడు నిర్మించారు?
అమెరికాలోని వివిధ దేశాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 1920లలో పాన్-అమెరికన్ హైవే నిర్మించారు. 1937లో, యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికోతో సహా 14 దేశాలు హైవే అభివృద్ధి, నిర్వహణ కోసం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. 1960లో ఈ హైవే పూర్తిగా అందుబాటులోకి వచ్చింది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




