Welcome 2023: 2022కి వెరైటీగా గుడ్‌బై చెబుతోన్న స్టార్ కపుల్.. ఇంతకీ క్యూట్ జంట ఎవరో గుర్తుపట్టారా.?
2022కి వీడ్కోలు చెప్పేందుకు అంతా సిద్ధవుతున్నారు. ఏడాదిలో చివరి రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పటికే అన్ని ప్లానింగ్స్ పూర్తి చేసుకున్నారు. దీనికి తగ్గట్లుగానే ఈవెంట్ ఆర్గనైజర్స్ సైతం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ఆకాశాన్నితాకే సంబురంతో పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ కొత్త ఏడాదికి ఆహ్వానం పలకనున్నారు. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.?..
2022కి వీడ్కోలు చెప్పేందుకు అంతా సిద్ధవుతున్నారు. ఏడాదిలో చివరి రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పటికే అన్ని ప్లానింగ్స్ పూర్తి చేసుకున్నారు. దీనికి తగ్గట్లుగానే ఈవెంట్ ఆర్గనైజర్స్ సైతం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ఆకాశాన్నితాకే సంబురంతో పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ కొత్త ఏడాదికి ఆహ్వానం పలకనున్నారు. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.? తమ ఇష్టమైన వ్యక్తులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు సినీ, క్రికెట్ సెలబ్రిటీలు విదేశాల్లో వాలిపోయారు.
ఈ నేపథ్యంలో ఓ జంట కూడా కొత్త ఏడాదికి సరికొత్తగా ఆహ్వానం పలుకుతోంది. పైన ఫొటోలో స్విమ్మింగ్ పూల్ పక్కన నిల్చున్న ఈ క్యూట్ కపుల్ ఎవరో గుర్తుపట్టారా.? ఈ స్టార్ జంట ఏడాదిలో చివరి సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో తీసిన ఫొటోను షేర్ చేశారు. ఈ జంట రెండు రంగాల్లో అగ్రగాములు. ఒకరు సినీ రంగంలో తనదైన ముద్రవేసి ఎంతో అభిమానులను సంపాదించుకుంటే, మరొకరు క్రికెటర్‌గా భారత కీర్తి పథాకాన్ని ఎలుగెత్తి చాటారు. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట 2021లో పండటి ఆడ బిడ్డకు జన్మనించింది.
View this post on Instagram
ఇంతకీ ఈ కపుల్ ఎవరో ఇప్పటికే తెలిసిపోయిందనుకుంటా.. అవును మీరు అనుకుంటోంది నిజమే ఈ కపుల్ మరెవరో కాదు అనుష్క, విరాట్‌లు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వెంటనే రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలిపోయే ఈ క్యూట్ కపుల్ తాజాగా ఇయర్ ఎండ్ వేడుకలు సైతం గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 2022 చివరి సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్నామంటూ ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేవారు. ఈ జంట ఫొటోను ఇలా పోస్ట్ చేశారో లేదో లక్షల్లో లైక్స్ వచ్చాయి. కేవలం గంటలోనే 26 లక్షల లైక్స్ రావడం విశేషం.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..