Video: ఆ బానిస బతుకు నాకొద్దు..! ఆటో డ్రైవర్‌గా మారిన స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగి!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నుండి ఆటో డ్రైవర్‌గా మారిన ఒక వ్యక్తి కథ ఇది. కార్పొరేట్ జీవితంలోని అధిక ఒత్తిడి, బానిసత్వాన్ని వివరిస్తూ, డబ్బు ఒక్కటే జీవితం కాదని సందేశమిచ్చాడు. ఆటో నడపడం ద్వారా జీవితంలో కొత్త అర్ధాన్ని, సంతృప్తిని కనుగొన్నానని అన్నాడు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనగానే భారీ జీతాలు, హైటెక్ లైఫ్ స్టైల్, అద్దాల మేడల్లో ఆఫీసులు, వీకెండ్ పార్టీలు అని చాలా మంది అనుకుంటారు. కానీ, వీటిన్నంటికీ మించి పని ఒత్తిడి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మించి సమయంతో సంబంధం లేకుండా బానిసల్లా పనిచేయాల్సి ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో మన తెలుగువాళ్లు సరదాగా కార్పొరేట్ కూలీలు అంటూ ఉంటారు. అయితే తాజాగా ఈ కార్పొరేట్ బానిసత్వం నుంచి విముక్తి పొందిన ఓ వ్యక్తి ఆటో డ్రైవర్‌గా మారాడు. తాను ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నానో వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ అతను ఏమన్నాడంటే..
“హాయ్ గైస్, నేను ఆటో నడుపుతున్నాను. లైఫ్ మళ్ళీ మొదలుపెట్టడానికి భయపడటం లేదు. ఒకానొక సమయంలో నేను జీవితాన్ని వదులుకున్న, ఇక ఎప్పటికీ కోలుకోలేనని అనుకున్నాను. కానీ నేను ఇక్కడ ఉన్నాను. ఆటో నడపడంతో ఇక జీవితంలో ఓడిపోను. జీవించి ఏదైనా చేయడంపై దృష్టి పెట్టండి అంటూ పేర్కొన్నాడు.
ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతూ.. డబ్బు ఒక అవసరం అని నాకు అర్థమైంది, కానీ డబ్బు ఒక్కటే అవసరం కాదు. జీవితంలో డబ్బు కాకుండా ఇతర ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మీ జీవితానికి విలువను వెతకండి, నిజమైన లక్ష్యాన్ని కనుగొనండి అని అన్నాడు. జీవితంలో అడ్డంకులు ఎదురైతే పారిపోవడానికి లేదా దాక్కునే బదులు వాటిని ఎదుర్కోవాలని సలహా ఇచ్చాడు. పైగా తన వీడియోపై ‘ఆటో డ్రైవర్.. నాట్ ఏ కార్పొరేట్ స్లేవ్’ అని క్యాప్షన్ ఇచ్చడు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
