Patanjali: ఆయుర్వేద ప్రొడక్ట్స్ అమ్మకాల్లో పతంజలి హవా.. ఎక్కువమంది కొంటున్నవి ఏంటో తెలుసా..?
పతంజలి ఉత్పత్తులకు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. భారత్‌లో ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా ప్రజలు వినియోగిస్తున్నారు. దీని ద్వారా పతంజలి అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న పతంజలి ప్రొడక్ట్స్‌లో ఏవేవీ ఉన్నాయి? అనే విషయాలు ఇందులో చూద్దాం.

Patanjali Best Selling Products: ఆయుర్వేద ఉత్పత్తుల్లో ఇండియాలో పతంజలి టాప్ బ్రాండ్‌గా కొనసాగుతోంది. విస్తృతమైన నెట్‌వర్క్‌తో తమ ప్రొడక్ట్స్‌ను దేశవ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తోంది. అలాగే తమ ఉత్పత్తులను మార్కెటింగ్ కూడా చేసుకుంటోంది. పతంజలి ఉత్పత్తులపై అనేక ఆరోపణలు వచ్చినా.. వాడేవారు మాత్రం తగ్గడం లేదు. ఇండియాలో వేరే ఆయుర్వేద బ్రాండ్స్ ఏవీ అంతగా పోటీ ఇవ్వలేకపోతుండటంతో పతంజలి ఈ వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇతర దేశాలకు కూడా పతంజలి తమ ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేస్తోంది. ఇప్పటికే దేశీ నెయ్యి, పాలపొడి, దంత్ కాంతి, అలోవేరా జెల్ వంటి ఉత్పత్తులు దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. ఎక్కువగా అమ్ముడుపోయిన పతంజలి ఉత్పత్తుల గురించి ఈ స్టోరీలో చూద్దాం.
ఆవు నెయ్యి
పతంజలి వెబ్‌సైట్ ప్రకారం చూసుకుంటే.. ఆవు నెయ్యి బాగా అమ్ముడవుతుంది. 5 లీటర్ల ఆవు నెయ్యి బాటిల్ రూ.3,843గా ఉంది.ఇక 200ML ఆవు నెయ్యి రూ.178, 900ML రూ.731, 450ML ధర రూ.393గా ఉంది. ఆవు నెయ్యి తొలి స్ధానంలో ఉండగా.. రెండో స్థానంలో చనా సత్తు ఉంది. 500 గ్రాముల చనాసత్తు రూ.100గా ఉంది. ఇక ఆ తర్వాత ఆవు పాలపొడిని ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. 500 గ్రాముల పతంజలి పాలపొడి రూ.235గా ఉంది.
ఆయుర్వేద మందులు
ఇక పతంజలి ప్రొడక్ట్స్‌లో ఆయుర్వేద మందులు, సప్లిమెంట్లను ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. దివ్య పీడనిల్ గోల్డ్ టాబ్లెట్ అమ్మకాల్లో ముందంజలో ఉంది. పతంజలి వెబ్‌సైట్‌లో ఈ ట్యాబ్లెట్ ధర రూ.480గా ఉండగా.. ఇతర ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో రూ.375గా ఉంది. రోజువారీగా ఉపయోగించే పదార్ధాలు, ట్యాబ్లెట్లు పతంజలి అమ్మకాల్లో ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పవచ్చు. మెడిసిన్స్ కంటే ప్రకృతిపరంగా లభించే ఆయుర్వేద పదార్ధాలు, మందులను ఉపయోగించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఆయుర్వేద ప్రొడక్ట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంతో ఆయుర్వేద ప్రొడక్ట్స్‌కు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. దీనిని ఆసరా చేసుకుని పతంజలి కాకుండా మరికొన్ని కంపెనీలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి.




