Funny Video: నాగిని కోసం నాగస్వరం ఊదితే నాగరాజు వచ్చాడు!.. ఇక అతను గోచీ చేతపట్టి పరుగో పరుగు..!

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటాయి.

Funny Video: నాగిని కోసం నాగస్వరం ఊదితే నాగరాజు వచ్చాడు!.. ఇక అతను గోచీ చేతపట్టి పరుగో పరుగు..!
Funny Skit
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 12, 2022 | 6:30 AM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటాయి. ఫన్నీ వీడియో మనుషులకు కాస్త రిలాక్స్ ఇస్తాయి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. ఇలాంటి ఫన్నీ వీడియోలను చూస్తే ఉపశమనం లభిస్తుంటుంది. అందుకే చాలా మంది తమ ఫోన్లలో ఫన్నీ వీడియోస్‌ని ఎక్కువగా వీక్షిస్తుంటారు. అయితే, తాజాగా అంతకు మించి అన్నట్లుగా ఉన్న ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో విపరీతంగా సర్క్యూలేట్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం జరిగిందో చూద్దాం..

సాధారణంగానే ప్రతిరోజూ భిక్షగాళ్లు దుకాణాల ముందు, ఇంటి ముందుకు వచ్చి భిక్షాటన చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో వేషంలో వచ్చి అడుక్కుంటారు. అయితే, కొందరు వీరి చర్యతో విసిగిపోతారు. చిల్లర లేవనో, ఇంట్లో ఎవరూ లేరనో, రకరకాల కారణాలు చెప్పి పంపించేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో కొందరు భిక్షగాళ్లు వింటారు.. కొందరు వినరు. దాంతో ఇంకాస్త చిర్రెత్తిపోతారు. అయితే, ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ వ్యక్తి వినూత్న రీతిలో భిక్షగాడికి ఝలక్ ఇచ్చాడు. నాగస్వరం ఊదుతూ ఓ వ్యక్తి అడుక్కుంటున్నాడు. ఈ క్రమంలో ఓ షాపు ముందుకు వచ్చి నాగస్వరం ఊదడం మొదటు పెట్టాడు. ఎంత సమయమైనా.. షాపులోంచి ఎవరూ రాలేదు. అయినా తగ్గేదే లే అన్నట్లు ఆ భిక్షగాడు.. నాగస్వరాన్ని నాన్ స్టాప్‌గా ఊదుతూనే ఉన్నాడు. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో గానీ.. ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం ఓ యువకుడు ఆ నాగస్వరానికి ధీటుగా నాగిని డ్యాన్స్ వేస్తూ బయటకు వచ్చాడు. ఇటు ఇతన నాగస్వరం ఊదటం.. అటు అతను నాగినిలా మారిపోయి ఊగిపోవడం అన్‌స్టాపబుల్ గా సాగింది. అప్పటికీ ఆ బిచ్చగాడు తగ్గకపోవడంతో.. నాగిని మాదిరిగా డ్యాన్స్ చేస్తున్న యువకుడు అతన్ని కాటేస్తున్నట్లు మీద మీదకు వెళ్లాడు. దాంతో హడలిపోయిన బిచ్చగాడు.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ ఫన్నీ సన్నివేశాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తూ నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘నాగిని కోసం ఊదితే.. నాగరాజు వచ్చి కాటేశాడు’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ క్రేజీ వీడియోను మీరు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేయండి.

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

Also read:

Viral Video: ఈ తిమింగలం వెరీ స్పెషల్ గురూ.. అడిగి మరీ ముద్దు పెట్టించుకుంటుంది..!

Viral Video: యజమాని కోసం ఇంజనీర్‌గా మారిన కుక్క.. వైరల్ అవుతున్న అద్భుతమైన వీడియో..!

Punjab Congress: సొంత పార్టీపైనే సెటైర్లు వేసిన సిద్ధూ.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!