Viral Video: వామ్మో.! ఇదేం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.!
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత యూత్ ఏదో విధంగా తాము పాపులర్ అవ్వాలని ఏవేవో చేస్తున్నారు. అవన్నీ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు...
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత యూత్ ఏదో విధంగా తాము పాపులర్ అవ్వాలని ఏవేవో చేస్తున్నారు. అవన్నీ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా బాగా పాపులర్ అయింది. తమ క్రియేటివిటీకి పదును పెట్టి.. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వధూవరులు తమకు నచ్చిన విధంగా ఫోటోలు దిగుతున్నారు. తాజాగా ఓ జంట పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ను డిఫరెంట్ గా చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో వధూవరులు ఒక గుడికి వెళ్లారు. అక్కడ వధూవరులిద్దరూ ఫోటోలు దిగుతున్నారు. వారికి తోడుగా మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. ఇందులో విచిత్రమేముందనుకోకండి.. ఈ వీడియోలో వరుడు తల క్రిందులుగా అంటే కాళ్లు పైకెత్తి తన చేతులపైన నిల్చున్నాడు. పక్కనే వధువు తకిట తథిమి.. తకిట తథిమి అంటూ డాన్స్ చేస్తుంది. తమ స్నేహితులంతా ఇది ఫోటో షూట్ చేస్తున్నారు. మధ్యలో వాళ్లు కూడా వీళ్ళకు జత కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజనం రకరకాలుగా స్పందిస్తున్నారు. వామ్మో… నేను బతికిపోయా.. నాకు ముందే పెళ్లయింది… లేకపోతే ఏంజరిగేదో అని ఒకరు అంటే… పెళ్లికి ముందే ఈ అమ్మాయి తలక్రిందులుగా నిలబెట్టింది. .. ఆ తర్వాత ఇంకేం చేస్తుందో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.