చూస్తుండగానే… ఆరంతస్తుల భవనం క్షణాల్లో నేలమట్టం..
కరాచీ నగరంలోని ఆరు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ భవనానికి బీటలు వారడంతో.. పెచ్ఛులు ఊడిపోయిందని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా ఈ భవనంలోని వారినందరినీ ఖాళీ చేయించామని వారు చెప్పారు. ఈ బిల్డింగ్ లో సుమారు 21 ఫ్లాట్లు ఉన్నాయి. సింధ్ బిల్డింగ్ కంట్రోల్ అథారిటీ అనుమతి లేకుండా ఏనాడో చట్ట విరుధ్ధంగా దీన్ని నిర్మించారు. భారీ బిల్డింగ్ కూలిపోతుండగా పెద్ద ఎత్తున దుమ్ము రేగింది. సమీపంలోనివారు భయంతో పరుగులు తీశారు. ఇది కూలడానికి […]

కరాచీ నగరంలోని ఆరు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ భవనానికి బీటలు వారడంతో.. పెచ్ఛులు ఊడిపోయిందని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా ఈ భవనంలోని వారినందరినీ ఖాళీ చేయించామని వారు చెప్పారు. ఈ బిల్డింగ్ లో సుమారు 21 ఫ్లాట్లు ఉన్నాయి. సింధ్ బిల్డింగ్ కంట్రోల్ అథారిటీ అనుమతి లేకుండా ఏనాడో చట్ట విరుధ్ధంగా దీన్ని నిర్మించారు. భారీ బిల్డింగ్ కూలిపోతుండగా పెద్ద ఎత్తున దుమ్ము రేగింది. సమీపంలోనివారు భయంతో పరుగులు తీశారు. ఇది కూలడానికి సిధ్ధంగా ఉందని బుధవారమే గుర్తించామని, అందువల్లే ఇందులోని వారిని ఖాళీ చేయాల్సిందిగా కోరామని అధికారులు పేర్కొన్నారు.