AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 ఏళ్ల క్రితం చనిపోయిన మహిళ మృతదేహం.. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది..! సైన్స్‌ని సవాలు చేసే అద్భుతం

నిపుణుల బృందం ఇటీవల తమ నివేదికను సమర్పించింది. మృతదేహం ఇంకా ఎందుకు కుళ్ళిపోలేదనే దానిపై ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయామని చెప్పారు. అన్ని టెస్టులు నిర్వహించిన అనంతరం సిస్టర్ విల్హెల్మినా శరీరం కుళ్ళిపోయినట్లు ఎలాంటి సంకేతాలు లేకపోవటం విశేషంగా ఉందని తుది నివేదికలో దర్యాప్తు బృందం పేర్కొంది. భద్రపరిచిన..

5 ఏళ్ల క్రితం చనిపోయిన మహిళ మృతదేహం.. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది..! సైన్స్‌ని సవాలు చేసే అద్భుతం
Catholic nun died 5 years ago
Jyothi Gadda
|

Updated on: Aug 24, 2024 | 9:37 PM

Share

మిస్సౌరీలోని ఒక చిన్న పట్టణానికి వందలాది మంది జనం తరలివచ్చారు. అక్కడో ఏదో ఒక అద్భుతమైన వింత సంఘటన జరిగిందని క్షణాల్లో ప్రపంచమంతా పాకిపోయింది. అదేంటంటే.. 2019లో మరణించగా పూడ్చిపెట్టిన ఓ మహిళ మృతదేహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉందని వార్త సంచలనంగా మారింది. గత ఐదేళ్లుగా సమాధిలో ఆమె శరీరం కుళ్ళిపోకుండా ఉండటంతో ఆ వింతను చూసేందుకు స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల జనాలు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనిని కొందరు కాథలిక్కులలో పవిత్రతకు సంకేతంగా చెబుతారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

2019లో 95 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. అయితే ఐదేళ్ల తర్వాత కూడా ఆమె మృతదేహం కుళ్లిపోలేదు. ఆ శవాన్ని పూడ్చిపెట్టినా అది మునుపటిలాగానే ఉందని తెలిసింది.. ఇది శాస్త్రవేత్తలను సైతం కలవరపరిచింది. ఇది ఆధునిక యుగపు అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యాన్ని చేధించలేకపోయారు. 2019లో మరణించిన 95 ఏళ్ల కాథలిక్ సన్యాసిని మృతదేహం ఎంత బాగా భద్రపరచబడిందంటే ఆమె గాఢ నిద్రలో ఉన్నట్లుగానే కనిపిస్తుందట.. ఆమె శరీరం 5 సంవత్సరాలు అలాగే ఉందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మిస్సౌరీలోని కాన్సాస్ సిటీకి చెందిన సోదరి విల్హెల్మినా లాంకాస్టర్ మే 29, 2019న 95 ఏళ్ల వయసులో మరణించారు. ఏప్రిల్ 2023లో ఆమె మరణించిన 4 సంవత్సరాల తర్వాత ఆమె మృతదేహాన్ని ఖననం కోసం అబ్బే చర్చికి తరలించడానికి వెలికి తీశారు. కాగా, అప్పటికీ కూడా ఆమె శరీరం కుళ్లిపోయిన ఆనవాళ్లు లేకపోవడంతో మృతదేహాన్ని గుర్తించారు. సిస్టర్ విల్హెల్మినా మృతదేహాన్ని ఎలాంటి ఎంబామింగ్ లేదా ఇతర చికిత్స లేకుండానే సీల్ చేయని చెక్క పెట్టెలో పాతిపెట్టారని అయినప్పటికీ ఆమె మృతదేహం అలాగే ఉండటం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అసాధారణ విషయం స్థానికంగా దావానలంలా వ్యాపించడంతో ఈ అద్భుతాన్ని చూసేందుకు వందలాది మంది తరలివచ్చారు. బిషప్ జోసెఫ్ సిస్టర్ విల్హెల్మినా మృతదేహాన్ని పరీక్షించి, రిపోర్ట్‌ చేసేందుకు స్థానిక వైద్య నిపుణుల బృందాన్ని నియమించారు. నిపుణుల బృందం ఇటీవల తమ నివేదికను సమర్పించింది. మృతదేహం ఇంకా ఎందుకు కుళ్ళిపోలేదనే దానిపై ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయామని చెప్పారు. అన్ని టెస్టులు నిర్వహించిన అనంతరం సిస్టర్ విల్హెల్మినా శరీరం కుళ్ళిపోయినట్లు ఎలాంటి సంకేతాలు లేకపోవటం విశేషంగా ఉందని తుది నివేదికలో దర్యాప్తు బృందం పేర్కొంది. భద్రపరిచిన పెట్టె లైనింగ్ పూర్తిగా చెడిపోయింది. కానీ, ఆమె శరీరం మునుపటిలాగే ఉందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..