AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pet Lion Viral Video: గాండ్రిస్తున్న సింహాన్ని చంటి బిడ్డలా ఎత్తుకున్నాడు.. కానీ చివరకు

ఇక్కడ వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కూడా ఒక వ్యక్తి భారీ సింహంతో కలిసి ఉన్న సీన్‌ ఎంతో భయంకరంగా ఉంది. అతని కంటే రెట్టింపు శరీరంతో ఎంతో గంభీరంగా ఉన్న ఆ సింహాన్ని అతడు ఒడిలో పెట్టుకుని ఉన్నాడు. ఆ సింహం కూడా అతనితో అంతే ప్రేమగా, స్నేహపూర్వకంగా ఉండటం వీడియోలో కనిపించింది.

Pet Lion Viral Video: గాండ్రిస్తున్న సింహాన్ని చంటి బిడ్డలా ఎత్తుకున్నాడు.. కానీ చివరకు
Pet Lion
Jyothi Gadda
|

Updated on: Aug 24, 2024 | 8:56 PM

Share

వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో ఎక్కువ భాగం అడవికి సంబంధించినవి. అవి కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం సింహానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి తన ఇంట్లో సింహాన్ని పెంపుడు జంతువుగా పెంచుకున్నట్టుగా కనిపించిన దృశ్యం అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. అతని ఒడిలో సింహం దర్జాగా కూర్చుని ఉంది.

భారతదేశంలో వన్యప్రాణులను పెంచకూడదని నియమం ఉంది. కానీ, థాయిలాండ్, యుఎఇతో సహా అనేక దేశాలలో క్రూర మృగాలను కూడా కొన్ని షరతులతో పెంచవచ్చునని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు చాలామంది ఎంతో ఆసక్తితో పులులు, చిరుతలు, సింహాలు మొదలైన వాటిని ఇంట్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు. ఇక్కడ వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కూడా ఒక వ్యక్తి భారీ సింహంతో కలిసి ఉన్న సీన్‌ ఎంతో భయంకరంగా ఉంది. అతని కంటే రెట్టింపు శరీరంతో ఎంతో గంభీరంగా ఉన్న ఆ సింహాన్ని అతడు ఒడిలో పెట్టుకుని ఉన్నాడు. ఎదురుగా ఎవరో ఇదంతా వీడియో తీస్తుండగా, ఆ సింహం పెద్దగా నోరు తెరిచి గ్రాండించింది.. అప్పుడు చూడాలి..మన గుండె ఆగిపోవాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

వైరల్‌ వీడియోలో అంతటి భయంకర, క్రూర మృగం సింహం కూడా ఆ వ్యక్తి ఒడిలో హాయిగా కూర్చుని ఉంది. అతనితో సింహం కూడా అంతే ప్రేమగా, స్నేహపూర్వకంగా ఉండటం వీడియోలో కనిపించింది. ఈ వీడియో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది X హ్యాండిల్ @AMAZlNGNATUREలో షేర్‌ చేయబడింది. కాగా, సోషల్ మీడియాలో వీడియో వేగంగా వైరల్‌ అవుతుంది. ఇప్పటివరకు దీనికి 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై వేలాది మంది వినియోగదారులు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..