AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: హౌజ్‌ఫుల్‌ ఈవెంట్‌లో చెవికమ్మలు పొగొట్టుకున్న యువతి.. అక్కడి జనం ఏం చేశారో తెలిస్తే..

ఓ అమ్మాయి తన స్నేహితులతో కలిసి ఈవెంట్ నుంచి వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది. అంతలోనే ఆమె చెవిపోగు పడిపోయింది. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంతవెతికినా ఎక్కడా కనిపించలేదు.. చుట్టుపక్కల చూస్తే జనం రద్దీ ఎక్కువగా ఉంది.. ఇంతలోనే ఆమెకు ఊహించని సీన్ కనిపించింది.

Watch: హౌజ్‌ఫుల్‌ ఈవెంట్‌లో చెవికమ్మలు పొగొట్టుకున్న యువతి.. అక్కడి జనం ఏం చేశారో తెలిస్తే..
Strangers Help Girl
Jyothi Gadda
|

Updated on: Aug 24, 2024 | 7:38 PM

Share

ఊహించండి, మీరు రద్దీగా ఉండే ప్రదేశంలో ఏదైనా పోగొట్టుకున్నట్లయితే, అపరిచితులు మీకు సహాయం చేస్తారని మీరు ఆశించగలరా..? ఖచ్చితంగా..నో అనే చెబుతారు.. ఇలాంటి ఏ చిన్న ఆశకూడా లేదు అని చెబుతారు. కానీ ఒక సంగీత కచేరీ తర్వాత అక్కడ జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అమెరికాలో జరిగిన ఒక సంఘటన ప్రజల హృదయాలను కదిలించింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అక్కడ జరిగిన మ్యూజిక్‌ ఫెస్ట్‌లో ఓ అమ్మాయి చెవిపోగులు జనసమూహంలో పడిపోవడంతో అక్కడ జరిగిన ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. సోషల్‌ మీడియాలో ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఎమ్మా హ్యూస్ అనే అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం సంఘటన వీడియోను షేర్‌ చేశారు. తనకు ఎలాంటి పరిచయం లేని వారు, అపరిచితులు పదుల సంఖ్యలో ముందుకు వచ్చారు. ఎటువంటి స్వార్థం లేకుండా, ఆ ఆ యువతి పోగొట్టుకున్న చెవిపోగును వెతికేందుకు ఎలా బయలుదేరారో వీడియోలో స్పష్టంగా కనిపించింది. చెవిపోగులు దొరికాయా? లేదా తెలియదు గానీ, మానవత్వం ఇంకా సజీవంగా ఉంది అని చెప్పటానికి ఇది ఉదాహరణగా నిలిచింది. లక్షలాది మందిని ఆలోచింపజేస్తూ ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అసలు విషయం ఏంటంటే..

ఇవి కూడా చదవండి

ఓ అమ్మాయి తన స్నేహితులతో కలిసి ఈవెంట్ నుంచి వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది. అంతలోనే ఆమె చెవిపోగు పడిపోయింది. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ, చుట్టుపక్కల చూస్తే జనం రద్దీ ఎక్కువగా ఉంది.. ఇంతలోనే ఆమెకు ఊహించని సీన్ కనిపించింది. ఆమె చెవిపొగులు పోయాయని తెలిసి అక్కడున్న వారంతా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అక్కడున్న అపరిచితులు చాలా మంది రోడ్డుపై వంగి ఆ అమ్మాయి చెవిపోగులు వెతకడానికి ప్రయత్నించారు. ఏదో ఒక్కరూ ఇద్దరు కాదు..ఏకంగా పదుల సంఖ్యలో ప్రజలు ఆ అమ్మాయికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. చెవిపోగు దొరకలేదు. కానీ, బోలెడంతా ప్రేమ దొరికింది అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ సంఘటన తన మనస్సులో లోతైన అనుభూతిని రేకెత్తించింది. అపరిచితులు నిస్వార్థంగా ఆమెకు చేసిన సాహయం అందరి గుండెలకు హత్తుకుంది.

ఈ వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Emma Hughes (@themainenanny)

సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అయ్యింది. 10 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. ఈ వీడియోపై చాలా కామెంట్‌లు వచ్చాయి. చాలా మంది వ్యక్తులు తమ మనోహరమైన అనుభవాలను పంచుకున్నారు. ఒక వినియోగదారు ఒకసారి తన అమ్మమ్మ ఉంగరం పోయిందని, అయితే అక్కడ ఉన్నవారు దానిని వెతికి ఇచ్చారని గుర్తుచేశారు. మనం మనుషులను ప్రేమించాలని, ఇదే నిజమైన మానవత్వం అని మరొకరు అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!