AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద వంకాయ.. ఏకంగా గిన్నిస్ రికార్డులో కెక్కింది.. బరువెంతో తెలిస్తే అవాక్కే..!

వంకాయలో చాలా రకాలు ఉన్నాయి. కానీ వాటి పరిమాణం సాధారణంగా చిన్నగా ఉంటుంది.. వాటిలో కొన్ని చిన్నవిగా, కొన్ని వంకాయలు సైజులో చాలా పెద్దవిగా ఉంటాయి. ఎక్కువ వరకు వంకాయలు 150గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. కానీ,

బాబోయ్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద వంకాయ.. ఏకంగా గిన్నిస్ రికార్డులో కెక్కింది.. బరువెంతో తెలిస్తే అవాక్కే..!
World Biggest Eggplant Pics
Jyothi Gadda
|

Updated on: Aug 24, 2024 | 9:14 PM

Share

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రతిరోజూ అనేక ఆసక్తికరమైన రికార్డులు నమోదవుతున్నాయి. ఈసారి వ్యక్తి చేసిన రికార్డు కాకుండా ఒక వంకాయ ప్రపంచ రికార్డు క్రియేట్‌ చేసిన అపూర్వ ఘటన వెలుగులోకి వచ్చింది. వంకాయలు చిన్నవే అయినప్పటికీ ఒక వ్యక్తి గుమ్మడికాయ పరిమాణంలో వంకాయను పెంచాడు. వంకాయ బరువు ఎంతగా ఉంటుందంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో దాని పేరు నమోదైంది. ఈ వంకాయ సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వంకాయలో చాలా రకాలు ఉన్నాయి. కానీ వాటి పరిమాణం సాధారణంగా చిన్నగా ఉంటుంది.. వాటిలో కొన్ని చిన్నవిగా, కొన్ని వంకాయలు సైజులో చాలా పెద్దవిగా ఉంటాయి. ఎక్కువ వరకు వంకాయలు 150గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. కానీ, డేవ్ బెన్నెట్ అనే వ్యక్తి 200-400 గ్రాములు కాదు, 3.77 కిలోగ్రాముల బరువున్న వంకాయను పండించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ @guinnessworldrecords అధికారిక Instagram హ్యాండిల్‌లో కూడా షేర్‌ చేశారు. దీని బరువు సాధారణ వంకాయల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. USAలో నివసించే డేవ్, ఏప్రిల్‌లో దీనిని పెంచాడు. ఏప్రిల్ ప్రారంభంలో డేవ్ బెన్నెట్ ఈ వంకాయ మొక్కను నాటాడు. రికార్డ్-సెట్టింగ్ గ్లోబ్ వంకాయ గుండ్రని, బొద్దుగా ఉండే పండ్లకు ప్రసిద్ధి చెందిన బ్లూమ్‌ఫీల్డ్‌లో జూలై 31న అయోవాలో పండించాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు సంబంధించిన ఈ వీడియోకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇలా పేర్కొంది..డేవ్ బెన్నెట్ పండించిన అత్యంత బరువైన వంకాయ 3.778 kg (8 lb 5.3 oz)’. ఈ వీడియో ఇంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయబడింది. చాలా మంది నెటిజన్లు దీనిపై కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది నిజంగా రికార్డు అంటూ ఒకరు కామెంట్‌ చేయగా, మరొకరు ఇది అద్భుతం అంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..