Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రేమలో మునిగితేలుతున్న పిల్లి – కుక్క.. చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..

Cat - Dog Viral Video : సోషల్ మీడియా (Social Media) ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.

Viral Video: ప్రేమలో మునిగితేలుతున్న పిల్లి - కుక్క.. చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..
Cat Dog Viral Video
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Feb 12, 2022 | 7:54 AM

Cat – Dog Viral Video : సోషల్ మీడియా (Social Media) ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. సింహాలు, పులుల వేటకు సంబంధించిన వీడియోలు, ఏనుగులు సరాదా వీడియోలు, పాముల భయంకర దృశ్యాలు వైరల్ అవుతుంటాయి. అలాగే పెంపుడు జంతువుల క్యూట్ అల్లరికి సంబంధించిన వీడియోలు కూడా ట్రెండ్ (Trending) అవుతాయి. ఇలాంటి వీడియోలను చూసేందుకు నెటిజనం తెగ ఇష్టపడుతుంటారు. తాజగా.. ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లికి, కుక్కకు రెండు ప్రేమించుకుంటున్నాయి.. అదేంది ప్రేమ ఏందీ అనుకుంటున్నారా..? ఈ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే. పిల్లి, కుక్క పిల్ల రెండూ కూడా వారి భావాలను ఒకరినొకరు అర్థం చేసుకొని ఆడుకుంటున్నాయి. వైరల్ అవుతున్న (Viral Video) ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు.

వైరల్ వీడియోలో పిల్లి.. కుక్క రెండు ప్రేమించుకోవడాన్ని చూడవచ్చు. రెండింటి మధ్య మంచి స్నేహం కనిపిస్తోంది. రెండు ముద్దులు ఇచ్చుకుంటూ కనిపించడాన్ని చూసి.. సోషల్ మీడియాలో నెటిజన్లు మురిసిపోతున్నారు. రెండూ కూడా ప్రేమలో మునిగి తేలుతున్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోను చూడండి.

వైరల్ వీడియో..

ఈ వీడియోను ట్విట్టర్‌లో buitengebieden_ అనే యూజర్ షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు పలు రకాలుగా సరదా కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: వయ్యారి భామ నీ హంస నడక.. ఆ విషయంలో తగ్గేదెలే అంటున్న బాతు.. వీడియో వైరల్

Twitter: ట్విట్టర్ సేవల్లో అంతరాయం.. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఫిర్యాదులు.. అసలేమైందంటే..?