Viral Video: వయ్యారి భామ నీ హంస నడక.. ఆ విషయంలో తగ్గేదెలే అంటున్న బాతు.. వీడియో వైరల్

Duck running on Treadmill: వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులు, పక్షులు, పాములకు సంబంధించినవి ఉంటాయి. తాజాగా.. ఓ బాతుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Viral Video: వయ్యారి భామ నీ హంస నడక.. ఆ విషయంలో తగ్గేదెలే అంటున్న బాతు.. వీడియో వైరల్
Duck
Follow us

| Edited By: Phani CH

Updated on: Feb 11, 2022 | 9:22 AM

Duck running on Treadmill: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని.. ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులు, పక్షులు, పాములకు సంబంధించినవి ఉంటాయి. తాజాగా.. ఓ బాతుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఎందుకంటే.. బాతు (Duck) ఆరోగ్యంపై దృష్టి సారించి తెగ వ్యాయామం చేస్తుంది. బాతు.. ఏంటీ..? వ్యాయామం చేయడం ఏంటీ అనుకుంటున్నారు.. కదా..? అవునండి బాతు ఫిట్నెస్‌పై దృష్టి పెట్టింది. ఈ హంస వీడియో (Viral Video) చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే.. ఫిట్నెస్‌పై బాతుకున్న అవగాహన.. కొంచెం ఉన్న చాలంటున్నారు నెటిజన్లు. ఈ హంస వీడియో చాలా క్యూట్‌గా ఉందంటూ.. మైమరిచిపోతున్నారు సోషల్ మీడియా (Social Media) నెటిజన్లు.

సాధారణంగా.. బాతులు, హంసలను వాటర్‌ఫౌల్స్ అని పిలుస్తారు.. ఎందుకంటే అవి సాధారణంగా చిత్తడి నేలలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు, నీరు ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే.. వైరల్ వీడియోలో బాతు ట్రెడ్‌మిల్‌ దగ్గర కనిపిస్తుంది. వైరల్ అవుతన్న ఈ 14 సెకన్ల వీడియోలో.. బాతు నడుస్తున్న ట్రెడ్‌మిల్ దగ్గర నిలబడి నెమ్మదిగా దాని పైకి ఎక్కి జాగింగ్ చేయడం కనిపిస్తుంది. నెమ్మదిగా ట్రెడ్‌మిల్ ఎక్కి బాతు.. పరుగులు తీస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వైరల్ వీడియోను మీరు కూడా చూడండి..

వైరల్ వీడియో..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా క్యూట్‌గా ఉందంటూ కొందరు పేర్కొంటుంటే.. మరికొందరు బాతును ఫిట్‌నెస్ ఫ్రీక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియనప్పటికీ ఈ వీడియో చూస్తున్న వారు మాత్రం మురిసిపోతున్నారు.

Also Read:

Digital Invitation: మీరెప్పుడైనా అందుకున్నారా డిజిటల్ ఇన్విటేషన్.. ఇది నయా ట్రెండ్ గురూ..

Anand Mahindra: ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్.. వాటిని అలా చేయాల్సిందంటూ సూచన..