AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Elections: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికపై ఈసీ కీలక ఉత్తర్వులు.. ఈసారి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎలా ఉంటుందంటే..

జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్​జారీ చేసింది. కార్పొరేటర్లు సహా ఎక్స్‌ అఫీషియో సభ్యులు చేతులెత్తే..

GHMC Elections: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికపై ఈసీ కీలక ఉత్తర్వులు.. ఈసారి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎలా ఉంటుందంటే..
Shiva Prajapati
| Edited By: |

Updated on: Dec 12, 2020 | 5:37 PM

Share

జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్​జారీ చేసింది. కార్పొరేటర్లు సహా ఎక్స్‌ అఫీషియో సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నికను నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్స్ నిబంధనలు 2005కు అనుగుణంగా ఎన్నిక విధానం ఉంటుందని ప్రకటించింది. ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు చట్టప్రకారం నమోదయ్యే ఎక్స్ అఫీషియో సభ్యులు చేతులెత్తి మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవచ్చని తెలిపింది. కాగా, ఎన్నికకు విప్ వర్తిస్తుందని.. విప్ ఉల్లంఘించినా వారి ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ వివరించింది. సభ్యుల ప్రమాణస్వీకారాల తర్వాత అదే రోజు మొదటగా మేయర్, ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సర్వసభ్య సమావేశానికి సగం మంది సభ్యుల హాజరు కోరం తప్పనిసరని తెలిపింది.

మేయర్ పదవికి ఒకరే పోటీ పడితే ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటిస్తారని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారని తెలిపింది. దీంతో మేయర్ నియామకానికి మేజిక్ ఫిగర్ అవసరం లేకుండా అయ్యింది. అయితే, ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే మాత్రం లాటరీ ద్వారా విజేతను ప్రకటించనున్నట్లు తెలిపింది. అలాగే మేయర్ ఎన్నిక పూర్తి కాకుండా డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణకు ఆస్కారం లేదని ఈసీ స్పష్టం చేసింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కోరం లేకపోయినా, ఎన్నిక జరగకపోయినా మరుసటి రోజు మళ్లీ చేపట్టనున్నట్లు తెలిపింది. రెండో రోజు కూడా జరగకపోతే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుందన్నారు.

Also Read:

వైరల్ వీడియో… సింహాన్ని వెంబడించిన ఇద్దరు… కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు…

ఒక సామాన్య రైతు బ్యాంక్ ఖాతాలో 473 కోట్లు.. అవాక్కయిన ఆసామి, యాదాద్రి భువనగిరి జిల్లాలో కోలాహలం