Corona: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న కరోనా మహమ్మారి వ్యాప్తి.. కొత్తగా 510 కేసులు నమోదు.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంట్లలో 510 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు.
Corona: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంట్లలో 67,495 సాంపిల్స్ పరీక్షించగా.. 510 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా గుంటూరు, కడప, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మృత్యువాత పడ్డారు. 665 మంది కరోనా బాధితులు కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. కాగా, తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,75,025 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 7, 052 మంది చనిపోగా.. 8,62,895 మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుండి క్షేమంగా డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 5,078 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరికి ఆస్పత్రులలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,07,67,117 సాంపిల్స్‌ను పరీక్షించారు. అయితే, చలికాలం నేపథ్యంలో కరోనా వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Also Read: