AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సచిన్ కాపాడిన చిన్ని ప్రాణం.. వైరల్ అవుతున్న వీడియో.. సలామ్ కొడుతున్న నెటిజన్లు..!

Viral Video: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు..

Viral Video: సచిన్ కాపాడిన చిన్ని ప్రాణం.. వైరల్ అవుతున్న వీడియో.. సలామ్ కొడుతున్న నెటిజన్లు..!
Sachin
Shiva Prajapati
|

Updated on: Feb 26, 2022 | 5:25 PM

Share

Viral Video: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. సచిన్‌కు సలామ్ కొడుతున్నారు. ఇంతకీ సచిన్ ఏం చేశారు? ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. సచిన్ టెండూల్కర్‌కు ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ నుంచి నిష్క్రమించినా.. ఆయన క్రికెట్ ఆరాధకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తరువాత వేరు వేరు కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు సచిన్. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు నిత్యం టచ్‌లోనే ఉంటారు. ఫన్నీ వీడియోలు, కామెంట్స్‌తో ఎంటర్‌టైన్ చేస్తుంటారు. అవసరమైన సమయంలో ప్రజలను మోటివేట్ చేస్తుంటారు.

అయితే, తాజాగా సచిన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సచిన్.. తాజాగా ఓ వీడియోపోస్ట్ చేశారు. ఆ వీడియోలో సచిన్ గాయపడిన ఓ సీగల్‌కి ప్రాణం పోశారు. బీచ్‌లో గాయపడి నిస్సాహయంగా పడిఉన్న సీగల్‌ కంట పడింది. దానిని చేరదీసిన సచిన్.. ఆ సీగల్‌కి నీరు తాపించారు. అనంతరం దానిని చేతిలో పెట్టుకుని ఆహారం తినిపంచేందుకు తీసుకెళ్లారు. పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్‌లో సీగల్ కోసం కొంత ఆహారం తీసుకుని పెట్టారు. అయితే సీగల్ రెక్కలు బాగానే ఉన్నాయని, ఎడమ కాలికి మాత్రం గాయమైందని సచిన్ చెప్పుకొచ్చారు. దీనికి పూర్తిగా తగ్గేవరకు సంరక్షిస్తానని చెప్పారు సచిన్.

కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన సచిన్.. ‘‘కొంచెం శ్రద్ధ, ఆప్యాయతతో మన ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ఎంత దూరమైనా వెళ్లవచ్చు!’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. సచిన్ స్పందించే హృదయానికి సెల్యూట్ చేస్తున్నారు అభిమానులు. ఈ వీడియోను దాదాపు 8 లక్షల మందికి పైగా చూశారు. సచిన్ కేరింగ్‌ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన ఉదారత, దయ గల మనస్తత్వాన్ని కొనియాడుతున్నారు నెటిజన్లు.

Also read:

UPSC Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే..యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Russia-Ukraine War: ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభంపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యూనుయేల్‌ మైక్రాన్‌ సంచలన వ్యాఖ్యలు

Indian Students Leaves Ukraine: కాసేపట్లో ఇండియాకు విద్యార్థులు.. ఎయిర్ ఇండియా విమానాల్లో తరలింపు..(లైవ్ వీడియో)