AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: 5 మ్యాచ్‌ల్లో 15.. ఓ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు.. ఫైర్ మీదున్న భారత బౌలర్.. వైరల్ వీడియో

గత నెలలో ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న మిడిల్‌సెక్స్ కౌంటీ క్లబ్‌తో టీమ్ ఇండియా స్టార్ పేసర్ ఉమేష్ యాదవ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Watch Video: 5 మ్యాచ్‌ల్లో 15.. ఓ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు.. ఫైర్ మీదున్న భారత బౌలర్.. వైరల్ వీడియో
Umesh Yadav
Venkata Chari
|

Updated on: Aug 15, 2022 | 7:05 AM

Share

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో లీగ్ క్రికెట్ సందడి చేస్తోంది. ది హండ్రెడ్ అండ్ రాయల్ లండన్ వన్ డే కప్ వంటి టోర్నమెంట్‌లు ఏకకాలంలో జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషానన్ని అందిస్తున్నాయి. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో చాలా తక్కువ మంది భారతీయ ఆటగాళ్లు ఆడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా వన్డే టోర్నీలో పలువురు ప్రముఖ భారత క్రికెటర్లు తమ సత్తా చాటుతున్నారు. వీరిలో టీమ్ ఇండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్.. ప్రస్తుతం ఈ టోర్నీలో తన వేగంతో నిప్పులు చిందిస్తున్నాడు.

గత నెలలో టీమిండియాతో కలిసి ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన ఉమేష్‌ యాదవ్‌కు అప్పుడు టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశం రాకపోవడంతో ఇంగ్లండ్‌ కౌంటీ క్లబ్‌ మిడిల్‌సెక్స్‌‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. మైదానంలో తన సత్తా చాటేందుకు అవకాశం దొరకడంతో, ఇక తన బౌలింగ్‌కు పదును పెట్టుకునేందుకు రెడీ అయ్యాడు. అప్పటి నుంచి ఉమేష్ తన బౌలింగ్‌తో సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా రాయల్ లండన్ వన్ డే కప్‌లో బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవడం కష్టమయ్యేలా విధ్వంసం సృష్టిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

టోర్నీలో అత్యధిక వికెట్లు..

మిడిల్‌సెక్స్‌ తరపున ఆడుతున్న ఉమేష్ ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో మైదానంలోకి దిగి టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 34 ఏళ్ల వెటరన్ భారత పేసర్ ఈ 5 మ్యాచ్‌ల్లో 17 సగటు, 18 స్ట్రైక్ రేట్‌తో గరిష్టంగా 15 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఉమేష్ ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి అద్భుతాలు కూడా చేశాడు.

ఉమేష్ ఈ ప్రదర్శనలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అతని బౌలింగ్ సహాయంతో, మిడిల్‌సెక్స్ ఈ 5 మ్యాచ్‌లలో 4 గెలిచింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో మాత్రమే జట్టు గెలవలేదు. ఇందులో ఉమేష్ 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు.

చెలరేగిన సెంచూరియన్‌ బ్యాట్స్‌మెన్‌..

ఆగస్ట్ 14 ఆదివారం కూడా ఉమేష్ యాదవ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. పరుగుల వర్షంలోనూ ఓవర్‌కు 6 పరుగుల కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సోమర్‌సెట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉమేష్ 10 ఓవర్లలో 58 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు వికెట్లు ఓపెనర్లవే కాగా, వారిలో ఒకరు అద్భుత సెంచరీ కూడా సాధించారు. 336 పరుగుల లక్ష్యాన్ని మిడిల్‌సెక్స్ 1 వికెట్ తేడాతో ఛేదించింది.