Video Viral: రోడ్డు మధ్యలో గుంత.. పూజలు చేసిన స్థానికులు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు..
మన దేశంలో రోడ్డు మీద ఉండే గుంతలు ప్రధాన సమస్యలు. రోడ్డుపై ఉండే గుంతల వలన అనేకసార్లు ఎన్నో ప్రమాదాలు జరిగాయి.
మన దేశంలో రోడ్డు మీద ఉండే గుంతలు ప్రధాన సమస్యలు. రోడ్డుపై ఉండే గుంతల వలన అనేకసార్లు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. కొన్ని సందర్బాల్లో అనేక మంది ప్రాణాలను సైతం కోల్పోయారు. టెక్నాలజీ పరంగా దేశం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రమాదాల నివారణ మాత్రం తగ్గడం లేదు. రోడ్డు మీద గుంతలను పూడ్చాలని స్థానిక అధికారులకు అక్కడి ప్రజలు ఎన్నిసార్లు చెప్పిన ఎలాంటి ఫలితం ఉండదు.. గుంతల కారణంగా ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నా.. అధికారులు పనితీరులో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఇలా అధికారుల పనితీరుతో విసిగిపోయిన స్థానికులు రోడ్డుపై ఉన్న గుంతకు పూజలు చేసి వినూత్న నిరసన తెలిపారు.
బెంగుళూరులోని భారతి నగర్ సొసైటీవాసులు రోడ్డు మీద గుంతలకు పూజలు చేశారు. ఇద్దరు పూజారులతో గుంతను పూలతో అలంకరించి.. పూజా చేశారు. అక్కడి స్థానికులు ఆ గొయ్యి చుట్టూ నిల్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గుంతలతో నిరాశ చెందిన స్థానికులు దేవతలను పిలవాలని నిర్ణయించుకున్నారని ట్విట్టర్ ఖాతాదారుడు క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ రోడ్ల దుస్థితి ఇలాగే ఉందని ప్రభుత్వం.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో ఎక్కువగా రహదారి పన్ను ఉంది. అయినా కానీ మారుమూల గ్రామాల కంటే దారుణంగా రోడ్లు ఉన్నాయని… ప్రభుత్వం దారుణగా విఫలమయ్యిందని ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
#POTHOLE puja in #Bengaluru!
Frustrated by potholes & craters, citizens invoke gods. Puja on Campbell Road by Bharathinagar Residents Forum ?
Why can’t the tech-city fix its roads?@NammaBengaluroo @WFRising @Namma_ORRCA @BLRrocKS @tinucherian @ShyamSPrasad pic.twitter.com/ZQQAEKfzI5
— Rakesh Prakash (@rakeshprakash1) November 30, 2021