Yellow Turtle: బంగారు వర్ణంలో మెరిసిపోతున్న అరుదైన తాబేలు.. ఓ గ్రామంలోని చెరువులో లభ్యం

Yellow Turtle: ప్రకృతి అద్భుతాలతో నిండి ఉంది. మనిషి ఎంతగా అన్వేషించినా.. రోజుకో చోట ప్రపంచంలో వింతలు, విశేషాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రకృతిలో అరుదైన జీవి..

Yellow Turtle: బంగారు వర్ణంలో మెరిసిపోతున్న అరుదైన తాబేలు.. ఓ గ్రామంలోని చెరువులో లభ్యం
Rare Yellow Turtle
Follow us

|

Updated on: Apr 27, 2022 | 4:18 PM

Yellow Turtle: ప్రకృతి అద్భుతాలతో నిండి ఉంది. మనిషి ఎంతగా అన్వేషించినా.. రోజుకో చోట ప్రపంచంలో వింతలు, విశేషాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రకృతిలో అరుదైన జీవి ఒకటి సోషల్ మీడియాలో(Social Media)  ఓ రేంజ్లో హల్ చల్ చేస్తోంది. ఒక అరుదైన తాబేలు. తాబేళ్లన్నీ దాదాపు నలుపు, బూడిద వర్ణంలో ఉంటే ఇది మాత్రం పసుపు పచ్చ రంగులో మెరిసిపోతోంది..ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సిములియా గ్రామంలోని ఓ చెరువులో ఈ అరుదైన తాబేలును గుర్తించారు. అక్కడి గ్రామస్థులు దానిని రక్షించి నీటి టబ్‌లో వేశారు. ఆ తాబేలును గ్రామానికి చెందిన ఒక యువకుడు గుర్తించాడు. గ్రామంలోని కొంతమందితో కలిసి వెళ్లి దానిని కాపాడారు. అనంతరం ఆ తాబేలును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. తాబేలు పెంకు, శరీరం పసుపు రంగులో ఉంది. ఇది చాలా అరుదైన తాబేలు జాతి అని అంటున్నారు అటవీశాఖ అధికారులు.

ముఖ్యంగా 2020 జూలైలో బాలాసోర్‌లోని సుజన్‌పూర్ గ్రామంలో మొదటి సారిగా పసుపు రంగు తాబేలు ఒకటి కనిపించిందని, దాన్ని కూడా తాము రక్షించినట్టు చెబుతున్నారు. అనంతరం.. 2020 అక్టోబర్ 27, పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ గ్రామ చెరువులో అరుదైన పసుపు తాబేలును గుర్తించారు. అరుదైన పసుపు తాబేలు చిత్రాలను అప్పట్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి దేబాశిష్ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో సంచలనంగా మారింది.

Also Read: Inspiring Story: 3 వేలతో మొదలై.. లక్షలు దాటిన బిజినెస్‌.. స్వయం ఉపాధితో రాణిస్తూ.. 19మందికి ఉపాధినిస్తున్న మహిళ